Satyendra Das: అయోధ్య ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కుడు క‌న్నుమూత‌ !

చికిత్స తీసుకుంటూ బుధవారం ఆయన తుదిశ్వాస విడిచారని సన్నిహితులు తెలిపారు.
సత్యేంద్ర దాస్ తన 20 ఏళ్ల వ‌య‌సులోనే ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు.


Published Feb 12, 2025 12:08:00 PM
postImages/2025-02-12/1739342401_17393395755897.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : అయోధ్య రామమందిర ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ కన్నుమూశారు. 85 ఏళ్ల దాస్ గత కొంతకాలంగా మధుమేహం , హై బీపీ తో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 3న బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను లక్నోలోని ఆసుపత్రికి తరిలించారు. చికిత్స తీసుకుంటూ బుధవారం ఆయన తుదిశ్వాస విడిచారని సన్నిహితులు తెలిపారు.
సత్యేంద్ర దాస్ తన 20 ఏళ్ల వ‌య‌సులోనే ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. నిర్వాణి అఖాడాలో చేరి ఆధ్యాత్మిక దీక్ష తీసుకున్నారు.

అయోధ్యరామాలయ ప్రారంభోత్సవం , బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సమయంలో కీలక పాత్ర పోషించారు. రామాలయ ప్రధాన పూజారి వ్యవహరిస్తున్నారు . 1992 లో బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందు నుంచే ఆయన రామమందిర అర్చకుడిగా ఉన్నారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu ayodhya temple

Related Articles