. ఆదివాసీల ఆచార సాంప్రదాయల ప్రకారం పూజలు చేసి సమ్మక్క , సారక్క జాతర ప్రారంభించారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : సమ్మక్క సారక్క దేవతలు కొలువు దీరిన మేడారంలో మినీ జాతర మొదలైంది. ఆదివాసి ఆచార సాంప్రదాయాల ప్రకారం నిర్వహించుకునే పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తారు. ఫిబ్రవరి 12, 13, 14, 15 తేదీలలో నాలుగు రోజుల పాటు మినీ జాతర నిర్వహిస్తారు. ఆదివాసీల ఆచార సాంప్రదాయల ప్రకారం పూజలు చేసి సమ్మక్క , సారక్క జాతర ప్రారంభించారు.
మేడారం గ్రామంలోని సమ్మక్క ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఆదివాసీల వ్యవసాయ ఉత్పత్తులు, అటవీ ఉత్పత్తులు, వివిధ రకాల ధాన్యం తీసుకొచ్చి వనదేవతలకు సమర్పిస్తారు. అనుబంధ గ్రామాల నుంచి కూడా ధాన్యాలు , పూలు , పండ్లతో అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు.
బయ్యక్కపేట లో సమ్మక్క పూజారులు ఆదివాసి ఆచార సాంప్రదాయ పూజ నిర్వహిస్తారు. మరోవైపు నాయకపోడు పూజారులుకూడా ఘట్టమ్మ గుట్ట ఆనవాయితీ ప్రకారం పూజలు నిర్వహిస్తారు… అదే సమయంలో పొలిమేర దేవతలకు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.