శ్రీనివాసునికి ..ప్రతి నెల విశేష ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఈ నెలలో ఏమేమి ఉత్సవాలు జరుగుతున్నాయనేది చూసేద్దాం.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులుగా తిరుమల వస్తుంటారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతినెల విశేష ఉత్సవాలు ఉంటాయి. అయితే మార్చి నెలకు సంబంధించిన విశేష ఉత్సవాలను టీటీడీ అధికారులు వెల్లడించారు. శ్రీనివాసునికి ..ప్రతి నెల విశేష ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఈ నెలలో ఏమేమి ఉత్సవాలు జరుగుతున్నాయనేది చూసేద్దాం.
మార్చినెలలో విశేష ఉత్సవాలు..
మార్చి 7న తిరుక్కచ్చినంబి శాత్తుమొర.
9న తిరుశేఖరాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభం.
10న మతత్రయ ఏకాదశి.
13న తిరుమల శ్రీవారి తెప్పోత్సవాల సమాప్తి
14న కుమారధారతీర్థం ముక్కోటి.
25న సర్వ ఏకాదశి
26న అన్నమాచార్య వర్ధంతి
28న మాస శివరాత్రి
29న సర్వ అమావాస్య
30న శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది. శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని నిర్వహిస్తారు.
తిరుచానూరు ఆలయంలో..
* మార్చి 7, 14, 21, 28 తేదీల్లో శుక్రవారం సందర్భంగా సాయంత్రం తిరుచ్చి ఉత్సవాలు జరుగుతాయి.
* మార్చి 24న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45గంటలకు ఆలయ మాడ వీధుల్లో గజ వాహనంపై ఊరేగిస్తారు.
* మార్చి 30 న ఉగాది పర్వదినం సంధర్భంగా సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి పుష్ప పల్లకిపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగిస్తారు. శ్రీ బాలకృష్ణ ఆలయంలో మార్చి 6 వ తేదీన స్వామివారికి తిరుచ్చి ఉత్సవం . శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో మార్చి 16 న శ్రీ సూర్యనారాయణ స్వామివారికి సాయంత్రం 5 గంటలకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.