Garbage Tax: ఇక పై ఏపీ లో చెత్తపన్ను లేదు..గెజిట్ ను రిలీజ్ చేసిన ప్రభుత్వం !

అధికారంలోకి వస్తే చెత్త పన్ను రద్దు చేస్తామని కూటమి నేతలు ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం చెత్త పన్నును రద్దు చేసింది.


Published Feb 22, 2025 11:30:00 AM
postImages/2025-02-22/1740204061_1499280tax.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: వైసీపీ ప్రభుత్వ హయాంలో విధించిన చెత్తపన్నును ఏపీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే.  డిసెంబర్ 31 నుంచి చెత్త పన్నును రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మున్సిపల్ చట్ట సవరణ తర్వాత గెజిట్ విడుదల చేసింది.  ఏపీ లో ఇకపై చెత్త పన్ను ఉండదు. వైసీపీ ప్రభుత్వం చెత్త పన్నును విధించినప్పటి నుంచి అప్పుడు విపక్షంలో ఉన్న నేతలు విమర్శలు గుప్పిస్తూనే వచ్చారు. ఎన్నికల ప్రచారంలో సైతం ఈ అంశాన్ని అస్త్రంగా వాడుకున్నారు.తను అధికారంలోకి వస్తే చెత్త పన్ను రద్దు చేస్తామని కూటమి నేతలు ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం చెత్త పన్నును రద్దు చేసింది.

newsline-whatsapp-channel
Tags : andhrapradesh newslinetelugu tax

Related Articles