ఆంధ్రలో చాలా చోట్ల , విజయవాడ, విశాఖ పట్నం , లాంటి ప్రాంతాల్లో తులం బంగారం 11.650 మిల్లీ గ్రాములు అంటే అక్కడ బంగారం లక్ష దాటింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : బంగారం కొనుగోలుదారులకు మళ్లీ షాక్ . బంగారం దరలు మళ్లీ పెరిగాయి. ఈ రోజు ఉదయం బంగారం 10 గ్రాముల బంగారం 200 రూ..పెరిగింది. ఇప్పుడు హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారం 22 క్యారట్ల బంగారం ధర 80 ,750 రూపాయిలు. కాని ఆంధ్రలో చాలా చోట్ల , విజయవాడ, విశాఖ పట్నం , లాంటి ప్రాంతాల్లో తులం బంగారం 11.650 మిల్లీ గ్రాములు అంటే అక్కడ బంగారం లక్ష దాటింది.
అలాగే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మరింత పెరిగింది. రూ.220 పెరిగి తులం బంగారం ధర రూ.88,090గా ఉంది. ఇక ఢిల్లీలో 22క్యారట్ల 10 గ్రాముల ధర రూ. 210 పెరిగి రూ. 80,900 గా ఉండగా ..24 క్యారట్ల 10 గ్రాముల ధర రూ. 220 పెరిగి రూ..88,240గా ఉంది.
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,08,000గా ఉంది
విజయవాడలో కిలో వెండి ధర రూ.1,08,000గా ఉంది
విశాఖలో కూడా కిలో వెండి ధర రూ.1,08,000గా ఉంది
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,01,000గా ఉంది