ఆంధ్రా లో ఇప్పటికే లక్ష దగ్గర్లో ఉంది. 10 గ్రాములకు వరుసగా ఈరోజు రూ. 600 నుంచి రూ. 700 మధ్య పెరిగాయి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : బంగారం కొనాలన్న కల కలగానే మిగిలిపోయేలా ఉంది. బంగారం ధర దారుణంగా పెరుగుతుంది. రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 87,800 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80,450 పలుకుతుంది. అదే ఆంధ్రా లో ఇప్పటికే లక్ష దగ్గర్లో ఉంది. 10 గ్రాములకు వరుసగా ఈరోజు రూ. 600 నుంచి రూ. 700 మధ్య పెరిగాయి.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరలేపడంతో అమెరికా స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పతనమయ్యాయి. ఇన్వెస్టర్లంతా పెట్టుబడులను బంగారంలో పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. దాంతో బంగారంలో పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. పసిడి ధరలు రూ. 90 వేల మార్క్ చేరుకునేలా కనిపిస్తుంది. ఆ పై లక్ష దాటిపోతుంది.
న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87,800 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80,450 వద్ద ట్రేడ్ అవుతోంది. కిలో వెండి ధర రూ. లక్ష వద్ద ట్రేడ్ అవుతుంది. ముంబై , చెన్నై నగరాల్లో మాత్రం 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87,650 వద్ద ట్రేడ్ అవుతుంది. కిలో వెండి ధర రూ.1,08,000 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖపట్నం లో కూడా ఇదే ధరలు ట్రేడ్ అవుతున్నాయి. అదే టైంలో కిలో వెండి ధరలు కూడా రూ. 1,08,000 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.