గోవింద, సునీతా అహుజాలు లైఫ్ స్టైల్ వేరు.ఇదే వారి మధ్య దూరాన్ని పెంచాయని టాక్ . గోవింద ప్రస్తుతం ఓ మరాఠీ యాక్టర్ తో రిలేషన్ లో ఉన్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఇప్పుడు ఇండస్ట్రీ లోనే కాదు ...బయట కూడా డివోర్స్ చాలా కామన్ అయిపోయింది. బాలీవుడ్ యాక్టర్ గోవింద ,ఆయన భార్య సునీతా అహుజా డివోర్స్ తీసుకోవడానికి రెడీ అవుతున్నట్లు బాలీవుడ్ మీడియా టాక్. ఈ జంట చాలా కాలంగా విడి విడిగా నివసిస్తున్నారట.
గోవింద, సునీతా అహుజాలు లైఫ్ స్టైల్ వేరు.ఇదే వారి మధ్య దూరాన్ని పెంచాయని టాక్ . గోవింద ప్రస్తుతం ఓ మరాఠీ యాక్టర్ తో రిలేషన్ లో ఉన్నారు. దీని వల్లే విడాకులు కోసం ఆలోచిస్తున్నారని టాక్. గోవింద్ భార్య తన పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంది. తమకు రెండు ఇళ్లు ఉన్నాయని ఆమె తెలిపారు. గోవింద తరచుగా తన బంగ్లాలో నివసిస్తూ ఉంటారని చెప్పారు. ఎందుకంటే ఆయన పలువురితో తరచు సమావేశాలు నిర్వహిస్తుంటారని, ఆ భేటీల తర్వాత ఆలస్యంగా ఇంటికి వస్తుంటారని ఆమె వెల్లడించారు. అందుకే తాను ఇద్దరు పిల్లలతో కలిసి వేరుగా ఫ్లాట్ లో ఉంటున్నట్లు చెప్పారు. అయితే ఈ సినీ కల్చర్ కూడా వారు విడిపోవడానికి ఓ కారణమంటూ మీడియా కథనాలు .
కాగా, గోవింద, సునీతా అహుజా 1987 మార్చిలో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు 1988లో కుమార్తె టీనా, 1997లో యశ్వర్ధన్ అనే కుమారుడు జన్మించాడు. 37 యేళ్ల వివాహ బంధానికి స్వస్థి పలకడానికి రెడీ అయిపోయారు .