న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : అమెరికాలో 5 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేవారికి పౌరసత్వం కల్పించేలా " గోల్డ్ కార్డు వీసాలను మంజూరు చేయనున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించేశారు. పెట్టుబడి దారుల కోసం ప్రత్యేకంగా 35 ఏళ్లుగా ఉన్న వీసా పాలసీని మార్చే యోచనలో ఉన్నట్టు తెలిపారు. "గోల్డ్ కార్డ్" వీసాను పొందే వ్యక్తులు చాలా డబ్బు సంపాదించి మిలియనీర్లు అవుతారని ట్రంప్ తెలిపారు.EB-5 వీసాల జారీపై ఏడాదికి కొంత పరిమితి ఉండగా, గోల్డ్ కార్డ్‌లపై అలాంటిదేమీ ఉండదని ట్రంప్ తెలిపారు. ఇది కూడా ఒకరకంగా శాశ్వత నివాస హోదా కల్పించే గ్రీన్‌కార్డ్ లాంటిదేని పేర్కొన్నారు.
అయితే ఈ వీసా పొందాలంటే జస్ట్ 43 కోట్లు కడితే సరిపోతుంది. ఈబీ _ వీసా విధానాన్ని 1990 లో కాంగ్రెస్ ఈ వీసా ను అప్రూవ్ చేసింది. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం గణాంకాల ప్రకారం 2021 సెప్టెంబరు నుంచి 2022 సెప్టెంబరు 30 వరకు దాదాపు 8వేల మంది ఈ ఇన్వెస్టర్ వీసాలను పొందారు. అయితే ఈ వీసా విధానంతో మోసాలు జరుగుతున్నాయని కొందరు అక్రమంగా నిధులు పొందుతున్నట్లు నాలుగేళ్ల క్రితం ఓ అధ్యయనంలో తేలింది.
ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాలు జారీ చేస్తున్నాయి. యూకే , స్పెయిన్ , గ్రీస్ , మాల్దా , ఆస్ట్రేలియా , కెనడా , ఇటలీ లాంటి దేశాలు పెట్టుబడులను ఆకర్షించేందుకు సంపన్నులకు ఈ వీసాలు ఇస్తున్నాయి. ఇప్పుడు ట్రంప్ కూడా ఇదే నిర్ణయం.