పాకిస్తాన్‌లపై విజయం సాధించి సెమీస్‌కు దూసుకువెళ్లిపోయింది. ఆదివారం దుబాయ్ వేదికగా పాక్ తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో గెలిచింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: అగ్రస్థాన మురిపం ఒక్క రోజే ..మళ్లీ రెండో స్థానానికి పడిపోయిన భారత్ ..రెండు మ్యాచ్ లు గెలిచినా కూడా రెండో స్థానానికే పరిమితం అయ్యింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు అదరగొడుతోంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లపై విజయం సాధించి సెమీస్‌కు దూసుకువెళ్లిపోయింది. ఆదివారం దుబాయ్ వేదికగా పాక్ తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో గెలిచింది.
సోమవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధించడంతో భారత్ రెండో స్థానానికి పడిపోయింది. న్యూజిల్యాండ్ సైతం ఆడిన రెండు మ్యాచ్ ల్లో గెలవగా ఆ జట్టు ఖాతాలో కూడా నాలుగు పాయింట్లే ఉన్నాయి. గ్రూప్-ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ జట్లు ఇప్పటికే సెమీస్ బెర్తులను ఖాయం చేసుకున్నాయి. ఇదే గ్రూప్ లో ఉన్న పాకిస్తాన్ , బంగ్లాదేశ్ లు ఇంటిముకం పట్టాయి. అటు గ్రూప్ _బి లో ప్రస్తుతం సౌతిఫ్రికా , ఆస్ట్రేలియా జట్లు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
కాగా.. గ్రూప్-బి నుంచి ఇంకా సెమీస్ చేరుకునే జట్లు ఏవో ఇంకా ఖరారు కాలేదు. ఆడిన ఒక్క మ్యాచ్‌లో ఓడినప్పటికి ఇంగ్లాండ్ ను సైతం తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఆ జట్టు మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కాబట్టి.. దక్షిణాప్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లలో రెండు జట్లు సెమీస్‌కు చేరుకునే అవకాశం ఉంది. భారత్ జట్టు టేబుల్ టాపర్ గా సెమీస్ కు చేరుకుంటే గ్రూప్ _బి లో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో తలపడుతుంది. మార్చి _2 ఆదివారం న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. ఆరు పాయింట్లతో భారత్ లీడ్ లో ఉంది.