36వ సారి
ఢిల్లీకి సీఎం రేవంత్
ప్రధానితో భేటీ అయ్యే అవకాశం
మూసీ ప్రాజెక్ట్, మెట్రో పొడింపుపై మెమొరాండం
ఢిల్లీకి సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్
తెలంగాణం, హైదరాబాద్(ఫిబ్రవరి 25): నేడు ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఉదయం 10:30 గంటలకు మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి, సీఎంవో సెక్రటరీ శేషాద్రి, డీజీపీ జితేందర్‌తో కలిసి ప్రధానితో సమావేశం కానున్నారు. హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్‌కు నిధులు, మెట్రో పొడిగింపు కోసం ఆర్థిక సహాయం, ఐపీఎస్ కేడర్ పెంపు ఇతర అంశాలపై ప్రధానికి మెమొరాండం ఇవ్వబోతున్నారని సమాచారం. ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను సైతం సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారని సీఎంవో వర్గాలు తెలిపాయి. మంగళవారం రాత్రే సీఎం రేవంత్ రెడ్డి బృందం ఢిల్లీకి చేరుకుంది. ప్రధానితో భేటీ అనంతరం కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కూడా రేవంత్ రెడ్డి కలిసే అవకాశముందని తెలుస్తుంది. మంత్రివర్గ విస్తరణతో పాటు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై పార్టీ అధిష్టానం పెద్దలతో రేవంత్ రెడ్డి చర్చిస్తారని సమాచారం.