దేశంలో 24 క్యారట్ల బంగారం ధర రూ. 86,240 రికార్డు స్థాయి ధరకు చేరుకుంది. ఇప్పుడు 22 క్యారట్ల బంగారం 79,050 గా నమోదయ్యింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : దేశంలో బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో వెండి , బంగారం ధరలు మరింత పెరిగాయి. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతోపాటు.. పెళ్లిళ్ల సీజన్ మొదలు కావడంతో బంగారం ధర రాకెట్ వేగంతో దూసుకెళ్తుంది. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం పై రూ. 1,040 పెరగ్గా ..22 క్యారట్ల బంగారం పై రూ. 950 పెరిగింది. దేశంలో 24 క్యారట్ల బంగారం ధర రూ. 86,240 రికార్డు స్థాయి ధరకు చేరుకుంది. ఇప్పుడు 22 క్యారట్ల బంగారం 79,050 గా నమోదయ్యింది.
మరో నెల రోజుల్లో 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ రేటు రూ. లక్షకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం డొనాల్డ్ ట్రంప్ తెరలేపిన వాణిజ్య యుధ్ధమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్టాక్ మార్కెట్ లో కూడా భారీగా పతనం కావడంతో తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లీస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కూడా తోడుకావడంతో బంగారం విక్రయాలు పెరుగుతున్నాయి.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.79,050 కాగా.. 24 క్యారట్ల ధర రూ.86,240. తెలుగు రాష్ట్రాల్లో ఇదే రేట్లు నడుస్తున్నాయి. వెండి ధర నాలుగు రోజుల తరువాత పెరిగింది. ఇవాళ కిలో వెండిపై రూ. వెయ్యి పెరిగింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర రూ. 1,07,000 వద్ద కొనసాగుతుంది.