ఆదివారం కిలో వెండి ధర రూ. 98,232 ఉండగా సోమవారం నాటికి రూ. 50 పెరిగి రూ. 98,282 కు చేరుకుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఇండియా , పాకిస్థాన్ గొడవల మధ్య బంగారం ధర భారీ తగ్గింది. ఆదివారం 10 గ్రాముల బంగారం దర రూ. 99,900 ఉండగా సోమవారం నాటికి రూ. 2,340 తగ్గి రూ. 97,560 కు చేరుకుంది. ఆదివారం కిలో వెండి ధర రూ. 98,232 ఉండగా సోమవారం నాటికి రూ. 50 పెరిగి రూ. 98,282 కు చేరుకుంది.
హైదరాబాద్ లో పది గ్రాముల బంగారం ధర రూ.97,560 గా ఉంది. కిలో వెండి ధర రూ. 98,282 గా ఉంది. ఇటీవల కాలంలో అమెరికా , చైనా ట్రేడ్ వార్ తో అంతర్జాతీయంగా మార్కెట్లపై ప్రభావం పడింది. దీంతో ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడుల కోసం బంగారం వైపు మొగ్గు చూపారు. దీంతో గోల్డ్ రేటు అవకాశమే హద్దుగా దూసుకెళ్లింది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో పాటు రష్యా, యుక్రెయిన్ దేశాల మధ్య ఉద్రిక్తతలుసైతం క్రమంగా తగ్గుతుండటంతో రాబోయే కాలంలో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
భారతదేశంలోనూ గోల్డ్ రేటు తగ్గింది. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం పై రూ. 1800 తగ్గగా 22 క్యారట్ల గోల్డ్ పై రూ. 1650 తగ్గింది. మరో వైపు వెండి ధర సైతం భారీగా తగ్గింది.