దాదాపు యావత్తు భారతదేశంలో 20 వేల కోట్ల బంగారం కొన్నట్లు సర్వేలు చెబుతున్నాయి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: 2024 ఏడాది మూడు నెలల్లో బంగారం ధరలు తగ్గాయని హ్యాపీ గా ఫీలయ్యేలోపు బంగారం రేటు మళ్లీ పెరిగింది. ఇలా పెరుగుతున్నా...నిన్న ధనత్రయోదశి బిజినెస్ చాలా బాగా జరిగింది. దాదాపు యావత్తు భారతదేశంలో 20 వేల కోట్ల బంగారం కొన్నట్లు సర్వేలు చెబుతున్నాయి.అయితే బంగారం ఎంత రేటు పెరిగాని బంగారం కొంటున్నారు జనాలు. ఫ్యూఛర్ లో బంగారం కంటే వెండి ఆభరణాలు ఎక్కువ డిమాండ్ ఉంటాయి.
గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో బంగారం, వెండి ధరలు స్ధిరంగా ఉండటం లేదు. ఓ వైపు వేగంగా పెరుగుతున్నాయి.. మరోవైపు బంగారం, వెండి ధరలు తగ్గుతూ నిరంతరం కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. రీసెంట్ గా బంగారం రికార్డు స్థాయి లెవెల్ లో పెరిగింది. నిన్న కాస్త తగ్గింది. ఈ రోజు మాత్రం 10 గ్రాముల బంగారం మీద మరో 200 పెరిగింది.గ్రాము మీద 20 రూపాయిలు పెరిగింది. దేశంలో దేవ్ దీపావళి సందర్భంగా ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 లు పెరిగి ఈ రోజు రూ. 73,760 లు కొనసాగుతోంది. అదే సమయంలో ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,460లకు చేరుకుంది.