ఇందులో ఎక్స్ ట్రీమ్-250ఆర్, ఎక్స్ పల్స్-210 బైకులతో పాటు, జూమ్ 125, జూమ్ 160 స్కూటర్లను కూడా ఆవిష్కరించింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: దేశీయ బైక్ తయారీ దిగ్గజం హీరో మోటో కార్ప్ దూకుడు మీదుంది. ఒకేసారి హీరో మోటో కార్ప్ నాలుగు కొత్త బైకులను పరిచయం చేసింది. ఢిల్లీలో ఏర్పాటు చేసి భారత్ మొబిలిటీ గలోబల్ ఎక్స్ -పో -2025 లో సింగిల్ టైంలో నాలుగు కొత్త మోడల్స్ ను ఇంట్రడ్యూస్ చేసింది. ఇందులో ఎక్స్ ట్రీమ్-250ఆర్, ఎక్స్ పల్స్-210 బైకులతో పాటు, జూమ్ 125, జూమ్ 160 స్కూటర్లను కూడా ఆవిష్కరించింది.
హీరో ఎక్స్ ట్రీమ్-250ఆర్ ప్రారంభ ధర రూ.1.80 లక్షలు (ఎక్స్ షోరూమ్) కాగా... జూమ్-125 స్కూటర్ ధర రూ.86,400 (ఎక్స్ షోరూమ్). ఈ కొత్త మోడల్స్ తో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ , డీఓహెచ్ సీ మోటర్ , టీఎఫ్ టీ డిస్ ప్లే , బ్లూటూత్ , డిజిటల్ స్పీడో మీటర్ కన్సోల్ , ఫోన్ ఛార్జర్ , 4 వాల్వ్ టెక్నాలజీ ,ఏబీఎస్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ , డ్యూయల్ చాంబర్ హెడ్ ల్యాంప్స్ తో స్మార్ట్ కీ ఆప్షన్ ఫీచర్లు ఈ బైక్ లో ఉన్నాయి. ప్రైజ్ కూడా అందుబాటులో ఉండడంతో ఈ బైక్స్ మార్కెట్ లో అమ్ముడవుతాయని కంపెనీ ఆశిస్తుంది.