రీసెంట్ గా బంగారం ధరలు, వెండి ధరలు పెరిగాయి. సోమవారం ధరలతో పోల్చుకుంటే శనివారం భారీగా పెరిగాయి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అంతర్జాతీయ పరిణామాలతో బంగారం రేటు మరో సారి చుక్కలు చూపిస్తుంది. కొత్త ఏడాది మొదటి తారీఖు నుంచే బంగారం రేటు స్థిరంగా కొనసాగుతుంది. రీసెంట్ గా బంగారం ధరలు, వెండి ధరలు పెరిగాయి. సోమవారం ధరలతో పోల్చుకుంటే శనివారం భారీగా పెరిగాయి.
సోమవారం పది గ్రాముల బంగారం ధర రూ.79,470 ఉండగా, శనివారం నాటికి రూ.1,332 పెరిగి 80,802 కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.90,020 ఉండగా, శనివారం నాటికి ఏకంగా 3,245 పెరిగి రూ.93,265 కు చేరింది.
విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, ప్రొద్దుటూరులో శనివారం ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఈ ధరలు ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం మీద పెట్టుబడులు చాలా ఎక్కువయ్యాయి. బంగారం ధర 2,640 డాలర్లు ఉండగా, శనివారం నాటికి 50 డాలర్లు పెరిగి 2,690 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 30.43 డాలర్లుగా ఉంది.
ఇప్పుడు బంగారం గ్రాము ధర 8 వేల రూపాయిలు కాగా 22 క్యారట్ల బంగారం ...7వేల రూపాయిలు ఉంది. వెండి కూడా భారీగా పెరిగింది. దీంతో పాటు ...బంగారం మీద కంటే వెండి మీద మరింత పెట్టుబడులు పెరుగుతున్నాయంటున్నారు నిపుణులు. అయితే మరింత రేటు పెరిగే ఛాన్స్ ఉంది.