Anasuya: బ్లేజర్ సీన్‌పై కామెంట్‌కు.. అనసూయ రిప్లై..!

ఈ ప్రమో కారణంగా అనుసయ మరోసారి తీవ్రమైన ట్రోలింగ్ బారిన పడిందనే చెప్పొచ్చు. ప్రోమోలో బ్లేజర్ తీసేసిన సీన్ చుసిన వారంతా ఆమెకు వ్యతిరేకంగా కామెంట్స్ పెట్టడం మొదలు పెట్టారు. అయితే, ఇందులో ఓ వ్యక్తి పెట్టిన కామెంట్ కు అనసూయ తనదైన స్టయిల్లో రిప్లై ఇచ్చింది. 
 


Published Jun 25, 2024 01:02:31 PM
postImages/2024-06-25//1719300751_Untitleddesign4.jpg

న్యూస్ లైన్ డెస్క్: గత కొంతకాలంగా బుల్లితెరకు దూరంగా ఉన్న యాంకర్ అనసూయ(Anasuya).. సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్‌గా ఉంటుంది. అప్పుడప్పుడు ఫోటోలు, ఫ్యామిలీతో కలిసి సరదాగా గడిపిన మెమోరీస్ కూడా తన అభిమానులతో పంచుకుంటుంది. అయితే, ఈవెంట్స్(events)కు దూరంగా ఉంటూ.. యాంకరింగ్‌‌కు బ్రేక్ ఇచ్చిన ఆమె మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

'కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్'(kirrack boys khiladi ladies) అనే షోకు సంబంధించిన ప్రమోలో అనసూయ కనిపించింది. ఇందులో భాగంగానే శేఖర్ మాస్టర్(Sekhar master), అనుసయకు మధ్య జరిగిన పోటీలో ఆమె బ్లేజర్ తీసేసింది. ఇప్పటికే ఆమె డ్రెస్సింగ్ పై నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వచ్చేవి. తాజాగా, ఈ ప్రమో కారణంగా అనుసయ మరోసారి తీవ్రమైన ట్రోలింగ్ బారిన పడిందనే చెప్పొచ్చు. ప్రోమోలో బ్లేజర్ తీసేసిన సీన్ చుసిన వారంతా ఆమెకు వ్యతిరేకంగా కామెంట్స్ పెట్టడం మొదలు పెట్టారు. అయితే, ఇందులో ఓ వ్యక్తి పెట్టిన కామెంట్ కు అనసూయ తనదైన స్టయిల్లో రిప్లై ఇచ్చింది. 

ఎంతో కష్టపడి అంచెలంచెలుగా ఎదిగారని అనసూయను మెచ్చుకున్నాడు. అయితే, ఇటీవల వచ్చిన ప్రోమోలో చేసిన పని నచ్చలేదని.. మళ్లీ ఇటువంటివి రిపీట్ చేయొద్దని సూచించాడు. అయితే, ప్రతిసారి ట్రోల్స్, కామెంట్స్ కు ఘాటుగా రిప్లై ఇచ్చే అనసూయ.. కొంచం కొత్తరకంగా రిప్లై ఇచ్చింది. అయితే, అనసూయ ఇలా కూడా రియాక్ట్ అవుతుందా అని అందరూ షాక్ అవుతున్నారు. నెటిజన్స్ కామెంట్స్ కు ఇచ్చిపడేసే అనసూయ.. ఈసారి కాస్త పద్దతిగా స్పందించి మరోసారి వార్తల్లో నిలిచింది. 

మనసులో ఉన్నదాన్ని బయటకు చెప్పే హక్కు అందరికీ ఉంటుంది. అయితే, అది ఇతరులను నొప్పించే పద్దతిలో ఉండకూడదు అని చెబుతూ అనసూయ కామెంట్ చేసింది. ప్రోమో నచ్చనందుకు క్షమాపణలు చెప్పింది. అయితే, అది స్టేజ్ పై వారు చేయబోయే పెర్ఫార్మన్స్‌కు ముందు సీన్ అని వివరించింది. ఎంటర్‌టైనర్‌గా ఇలాంటివి చేయడం సహజమని.. దీనిపై అభిమానుల నుండి వచ్చిన రియాక్షన్‌ను కూడా గుర్తుంచుకుంటామని తెలిపింది. 

newsline-whatsapp-channel
Tags : entertainment anchor anasuya shekar-master kirrak-boys-khiladi-girls trolling comments

Related Articles