webseries: '1000 బేబీస్' (హాట్ స్టార్) వెబ్ సిరీస్ రివ్యూ!

ఈ సిరీస్ లో నీనా గుప్తా .. రెహమాన్ (రఘు) ప్రధానమైన పాత్రలను పోషించారు. నిన్నటి నుంచి ఈ సిరిస్ 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది


Published Oct 22, 2024 12:19:00 PM
postImages/2024-10-22/1729579884_yl1Pxar7IREKE1FUI0Ob.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : '1000 బేబీస్'.. ఈ సీరిస్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు . ఈ సీరిస్ ను నజీమ్ కోయ దర్శకత్వం వహించారు.వహించిన ఈ సిరీస్ లో నీనా గుప్తా .. రెహమాన్ (రఘు) ప్రధానమైన పాత్రలను పోషించారు. నిన్నటి నుంచి ఈ సిరిస్ 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది. 7 ఎపిసోడ్స్ గా వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 


సారా మానసిక స్థితిని కోల్పోయినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆమె కొడుకు 'బిబిన్' ఆమెను ఊరికి దూరంగా ఉన్న ఒక ఇంట్లో ఉంచి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. సారా ఎప్పుడు గోడపై ఏదోక అడ్రస్ రాస్తూ ఉంటుంది. మార్కర్ పెన్ కాని తనకు అందుబాటులో లేకపోతే చాలా చిరాకు పడిపోతుంది. తన చుట్టు వందల ఉయ్యాలలు ఉన్నట్లు వేల పసిపిల్లలు కనిపిస్తున్నట్లు ఆందోళన చెందుతూ ఉంటుంది.


 ఒక రోజున సారా తన కొడుకైన 'బిబిన్'కి ఒక చేదు నిజం చెబుతుంది. దాంతో ఆవేశంతో అతను ఆమెపై దాడి చేసి పారిపోతాడు. గాయాలతో సారా హాస్పటిల్ పాలవుతుంది. హాస్పటిల్ లో ఉంటూ రెండు షీల్డ్ కవర్స్ ఇస్తుంది. ఒకటి పోలీసులకు మరొకటి కోర్టులో ఇవ్వమని కోరుతుంది. చనిపోతుంది. 


సారా రాసిన లెటర్ చదివిన మేజిస్ట్రేట్ షాక్ అవుతాడు. సీఐ నవాజ్ .. ఎస్పీ అనిల్ దాస్ తో కలిసి మేజిస్ట్రేట్ ను కలుస్తారు. ఆ కవర్లో సారా రాసిన విషయాలు నిజమేనని చెబుతారు. ఆవిషయాలు ఏవీ బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా దాస్తారు. అలా 12 యేళ్ల తర్వాత  సారా కొడుకు పేరు ఓ మర్డర్ కేసులో వినిపిస్తుంది.'బీచ్ హాస్పిటల్' లో హెడ్ నర్సుగా సారా పనిచేస్తూ ఉండేది. వైవాహిక జీవితానికి ఆమె దూరమవుతుంది. అందుకు కారణం ఆమెకి సంతానం లేకపోవడమే. దాంతో ఆమెలో ఒక రకమైన శాడిజం పెరిగిపోతుంది. తన హాస్పిటల్లో ఆడ శిశువులను కన్నవారికి మగ శిశువులను .. మగశిశువులను కన్నవారికి ఆడశిశువులను పురిటిలోనే మార్చేస్తుంది. అలా తను వెయ్యి మంది పిల్లలను మార్చేస్తుంది. అలా మర్చేసిన తర్వాత వారి ఇద్దరి అడ్రస్ లను డైరీలో రాసుకుంటుంది. ఇప్పుడు ఉన్న బిబిన్ కూడా అలా వేరే వారి దగ్గర నుంచి ఎత్తు కొచ్చేస్తుంది. స్టోరీ ఇదే....ఇంకా ఏదో ఉన్నట్లు తీశారు కాని సీరిస్ అస్సలు ఇంట్రస్టింగ్ గా లేదు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu webseries review baby

Related Articles