Unstoppable: అన్‌స్టాప‌బుల్ సీజన్ 4.. చంద్ర‌బాబు, బాల‌య్య ప్రోమో గ్లింప్స్ !

బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరస్తున్న అన్ స్టాబుల్ సీజన్ 4 కు అంతా సిధ్దమైంది. ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో స్టార్ట్ అవుతుంది.


Published Oct 22, 2024 10:50:00 AM
postImages/2024-10-22/1729574539_3ClTJYFYqorvRRDKwj3h.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరస్తున్న అన్ స్టాబుల్ సీజన్ 4 కు అంతా సిధ్దమైంది. ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో స్టార్ట్ అవుతుంది. ఈ నెల 25 రాత్రి 8:30 కు ఆహా ఓటీటీ ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ రానుంది. గతంలో రెండో సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ కూడా చంద్రబాబుతో ప్రారంభమైంది.


ఈ టాక్ షోకు సంబంధించిన ఫ‌స్ట్ ఎపిసోడ్‌ షూటింగ్ ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో పూర్తి చేయ‌డం జ‌రిగింది. అయితే దీనికి సంబంధించిన ప్రొమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో చంద్రబాబు చాలా అంశాలను తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరును కూడా ఇందులో హైలెట్గా నిలిచాయి.


ఇక తాజాగా విడుదలైన  ప్రోమోలో మా బావగారు.. మీ బాబు గారు.. చంద్రబాబు నాయుడు గారు అంటూ ఆయన్ను బాల‌య్య‌ ఆప్యాయంగా ఆహ్వానించ‌డం మ‌నం చూడొచ్చు. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో కక్ష రాజకీయాలు మొదలయ్యాయి. తాను మాత్రం వాటికి దూరంగా ఉంటాను. కానీ తప్పు చేస్తే మాత్రం ఎట్టిప‌రిస్థితుల్లో వ‌దిలే ప్రసక్తి లేదంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు.  అంతేకాదు బాలయ్య చాలా హాట్ క్వశ్చన్స్ తో ప్రశ్నల వర్షం కురిపించారు. ఆకాశంలో సూర్యచంద్రులు, ఇక్కడ బాబు, పవన్ కళ్యాణ్ లు అంటున్నారు ఎంత వరకు నిజం అని అడిగారు. దీనికి చంద్రబాబు రిప్లై ఇస్తూ.. మీరు (బాలయ్య) ఎలాగైతే సినిమాల్లో అన్‌స్టాప‌బుల్‌గా ఉన్నారో.. రాజకీయాల్లో నేను అన్‌స్టాప‌బుల్ అంటూ చెప్పడం బాగుంది.  దీంతో ఈ ఎపిసోడ్ కోసం ఫుల్ వెయిట్ చేస్తున్నారు జనాలు.

newsline-whatsapp-channel
Tags : chandrababu pawankalyan newslinetelugu balakrishna

Related Articles