పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల పరిధిలోని బిబిపేటలోని జిల్లా ఉన్నత పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. గుడ్లు తినడం వల్ల 24 విద్యార్థులు అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది.
న్యూస్ లైన్ డెస్క్: ఇప్పటివరకు గురుకులాల్లో ఉండే విద్యార్థులకే ఫుడ్ పాయిజన్ అయిన ఘటనలు చూశాం. కానీ, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కూడా అదే పరిస్థితి వచ్చింది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల పరిధిలోని బిబిపేటలోని జిల్లా ఉన్నత పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. గుడ్లు తినడం వల్ల 24 విద్యార్థులు అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది.
విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో ఉపాధ్యాయులు ఫుడ్ పాయిజన్ అయినట్లు గుర్తించారు. విద్యార్థులను నారాయణఖేడ్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఒకేసారి 24 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో హాస్పిటల్‌లో బెడ్లు సరిపోక.. ఒక్క బెడ్డుపై ముగ్గురిని ఉంచి చికిత్స చేస్తున్నారు.