Looteri Dulhan: ‘దోపిడీ పెళ్లి కూతురు’.. జస్ట్ 1.5 కోట్లే !

ఈ క్రమంలో రూ. 10 లక్షలు దండుకుంది. అనంతరం గతేడాది జైపూర్ కు చెందిన వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది.


Published Dec 23, 2024 02:45:00 PM
postImages/2024-12-23/1734945398_5nvp3cn8kanpurbride625x30023December24.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పెళ్లి..పేరుతో అందిన కాడికి దోచుకొని పరారయ్యే దోపిడీ పెళ్లి కూతురు కు పోలీసులు అరెస్ట్ చేశారు. అయినా పెళ్లి చేసుకోవడం , ఆపై సెటిల్ మెంట్ పేరుతో పెద్ద మొత్తంలో దండకునే నిందితురాలి ఆగడాలకు పదేళ్ల తర్వాత చెక్ పెట్టారు. ఉత్తరాఖండ్‌కు చెందిన సీమా అలియాస్ నిక్కి 2013లో తొలుత ఆగ్రాకు చెందిన వ్యాపారిని వివాహం చేసుకుంది. కొన్నాళ్లకు భర్త కుటుంబసభ్యుల పై కేసు పెట్టింది. తర్వాత రూ.75 వసూలు చేసి కేసును ఉపసంహరించుకుంది.


2017లో సీమా గురుగ్రామ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో రూ. 10 లక్షలు దండుకుంది. అనంతరం గతేడాది జైపూర్ కు చెందిన వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. అనంతరం రూ. 36 లక్షల విలువైన నగలు, నగదు తో ఉడాయించింది. ఆ కుటుంబం కేసు పెట్టడంతో నిందితురాలు సీమాను తాజాగా జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 


నిజానికి ఈమె టార్గెట్ అంతా ...  మ్యాట్రిమోనియల్ సైట్లలో చూసి భార్యలను కోల్పోయిన వారు, విడాకులు అయిన వారిని ఎంచుకుంటున్నట్టు పోలీసులు తెలిపారు. వివిధ రాష్ట్రాల వారిని పెళ్లి చేసుకొని ఇప్పటి వరకు రూ. 1.25 కోట్లు సెటిల్ మెంట్ల రూపంలో వసూలు చేసినట్లు పేర్కొన్నారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu uttarpradesh married-womens

Related Articles