Beer: బీర్‌ కోసం 3 నెలల కొడుకును అమ్మేసిన పేరెంట్స్ !

వెళ్లి చూడగా ...ఇంకేముంది అక్కడ బిడ్డ మాత్రమే ఉంది. తల్లితండ్రులు ఎవరు లేరు. వదిలేసి పారిపోయారు.


Published Sep 30, 2024 07:41:00 PM
postImages/2024-09-30/1727705517_images1.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బీరు కోసం ఓ జంట తమ కన్నబిడ్డను అమ్మే ప్రయత్నం చేశారు ఈ జంట. రోజులు మారిపోయాయి..తల్లి పిల్ల ప్రేమలు లేవు..కొందరిలో ఆ హార్మోన్ పనిచేయదో ఏంటో కాని ..మరీ కఠినంగా ఉంటున్నారు. ఈ ఘటన అమెరికాలో జరిగింది. బోడి బీరు కోసం తొమ్మిది నెలలు మోసి కని ..ఆ కష్టాన్ని కూడా లెక్క చెయ్యలేదు ఆ తల్లి.మూడు నెలల పిల్లాడిని బీరు, డబ్బు కోసం విక్రయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. వెళ్లి చూడగా ...ఇంకేముంది అక్కడ బిడ్డ మాత్రమే ఉంది. తల్లితండ్రులు ఎవరు లేరు. వదిలేసి పారిపోయారు.


వెయ్యి డాలర్ల (సుమారు రూ.83 వేలు) డబ్బు, బీరు కోసం తమ కొడుకును విక్రయిస్తున్నట్లు డేరియన్‌ అర్బన్‌, షలేన్‌ ఎహ్లర్ల్స్‌పై అధికారులకు ఫిర్యాదు వచ్చింది. పిల్లాడి శరీరంపై దద్దుర్లు, బొబ్బలు ఉన్నాయని అత్యవసర వైద్య సహాయం అవసరమని కాల్‌ చేసి చెప్పారు. అయితే బిడ్డ తల్లిదండ్రులు నివసించిన గుడారంలో వారు తమ బిడ్డను వెయ్యి డాలర్లకు అమ్మేయడానికి అంగీకరించిన లేఖను అధికారులు గుర్తించారు. బిడ్డకు బదులుగా వెయ్యి డాలర్లు క్యాష్ చెక్కు , బీర్లు ఇవ్వాలని ఒప్పందం రాసుకున్న పేపర్లు దొరికాయి. పిల్లల సంక్షేమానికి హాని కలిగించే నేరారోపణపై వారిని స్థానిక జైలులో ఉంచారు. దత్తత తీసుకుందామనుకున్న వారిని అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు .

newsline-whatsapp-channel
Tags : viral-news sales new-couples baby

Related Articles