చిన్న పిల్లలే కాదు ..పెద్ద వాళ్లకి అదే పరిస్థితి. ఫోన్ లేకపోతే బాత్రూమ్ కి కూడా వెళ్లని వారు చాలా మంది ఉన్నారు. మరి చిన్నారులను ఎలా ఫోన్ మాన్పించాలనే విషయం పై టీచర్ ఓ ఇంట్రస్టింగ్ పని చేశారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్; రెండో నెల , మూడో నెల నుంచే పిల్లలకు ఫోన్ అలవాటయిపోతుంది. పిల్లలు చాలా ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నారు.ఇంటర్నెట్ విరివిరిగా దొరకడం వల్ల కూడా ఈ ఇబ్బంది వస్తుంది. అంతేకాదు ఈ ఫోన్ వల్లే ..పిల్లల్లో స్పీచ్ డిలే మొదలవుతుందని ..అంటున్నారు. చిన్న పిల్లలే కాదు ..పెద్ద వాళ్లకి అదే పరిస్థితి. ఫోన్ లేకపోతే బాత్రూమ్ కి కూడా వెళ్లని వారు చాలా మంది ఉన్నారు. మరి చిన్నారులను ఎలా ఫోన్ మాన్పించాలనే విషయం పై టీచర్ ఓ ఇంట్రస్టింగ్ పని చేశారు.
ఢిల్లీలో ఒక ప్రైవేటు స్కూల్ లో పిల్లలు మొబైల్ లకు అడిక్ట్ అవుతున్నారు అని.. ఒక టీచర్ వినూత్న ఆలోచన చేసింది. ఫోన్ చూడడం వల్ల ఎంత నష్టపోతామో ఓ స్కిట్ వేసి చూపించారు.. ఆ టీచర్ కంటికి గాయం అయినట్లుగా కట్టుకట్టుకుని మరో కంట్లో రక్తం కారుతున్నట్లుగా ఎర్రటి రంగును పూసుకుంది. కంటి గాయాలతో నటిస్తూ స్కూల్ గ్రౌండ్ లో ఉన్న పిల్లల ముందుకు వచ్చేసింది. ఆమెను చూసి తోటి ఉపాధ్యాయులతో పాటు స్కూల్ పిల్లలు కూడా భయపడిపోయారు. వెంటనే పిల్లలందరికి ఆ టీచర్ ఫోన్ ఎక్కువ చూడడం వల్ల కళ్ల నుంచి రక్తం వస్తుందని చెప్పింది. డాక్టర్ ఇంజక్షన్ కూడా వేశారు అంటూ ఏడ్వడం మొదలుపెట్టారు.
మొబైల్ ఫోన్ పట్టుకోవాలంటేనే భయం వచ్చేలా చేసారు ఆ టీచర్. కొందరు పిల్లలు ఫోన్ తీసుకోవడానికి నిరాకరించారు. తన టీచర్ కు ఇలా జరగడం ఫోన్ వల్లే అని కొంతమంది పిల్లలు ఏడ్చారు. ఇక పై ఫోన్ చూడమంటు బెదిరిపోయారు. పేరు పేరునా ఫోన్ కావాలా ..తీసుకుంటావా అని అడిగినా వద్దు మేడం అంటూ ఓకటే ఏడుపు. టీచర్ పనికి నెటిజన్లు సూపర్ కూల్ అంటు పొగుడుతున్నారు.