విశాల్ ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆ కార్యక్రమంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : హీరో విశాల్ అస్వస్థతకు గురయ్యారు. తమిళనాడు లోని విల్లుపురం లో కూవాకం కూతాండవర్ దేవాలయ ఉత్సవం సంధర్భంగా తిరునంగైవుల అలకిప్ పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోలీవుడ్ స్టార్ విశాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే స్టేజీ ఎక్కిన కొద్దిసేపటికే ఆయన స్పృహ తప్పి కిందపడిపోయారు. అయితే ప్రాథమిక చికిత్స తర్వాత అనారోగ్యం నుంచి కాస్త తేరుకున్నారు విశాల్ . ఆ తర్వాత ఆయన ఆసుపత్రికి బయల్దేరారు. విశాల్ ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆ కార్యక్రమంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.
ఎంతో ఫిట్ గా ఉండే విశాల్ ఇప్పుడు ఇలా మారిపోవడానికి గల కారణాలను అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఆయన ఈ ఏడాది జనవరిలో మదగజరాజ సినిమా ప్రమోషన్ లో కూడా విశాల్ చేతులు వణుకుతూ ..చాలా సన్నగా అయిపోవడంతో అప్పట్లో చాలా వైరల్ అయ్యింది. తిరిగి తేరుకున్నాక విశాల్ కు డెంగ్యూ ఫీవర్ అని చాలా చెప్పారు. ఇప్పుడు తిరిగి ఆయన ఆరోగ్యంపై పలువురు అందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు విశాల్ మళ్లీ స్పృహతప్పి పడిపోవడంతో ఆయన ఫ్యాన్స్ ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.. అయితే ఆహారం తినకపోవడంతోనే విశాల్ స్పృహ కోల్పోయినట్లు వైద్యులు తెలిపినట్లు తెలుస్తోంది.