హైదరాబాద్ రామచంద్రాపురంలోని అశోక్‌నగర్‌లో తెనాలి యువకుడు ఉదయ్ (23) నివాసం ఉంటున్నాడు. ఆదివారం రోజున తన స్నేహితులతో కలిసి అతడు చందానగర్‌లోని వీవీప్రైడ్ హోటల్‌కు వెళ్లాడు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: నిజానికి ఈ విషయం తెలిసి నవ్వాలో.. భయంతో అతను చేసిన పనికి జాలిపడాలో అర్ధం కావడం లేదు. వీకెండ్‌ను సరదాగా ఎంజాయ్ చేసేందుకు కొంతమంది యువకులు ఓ హోటల్‌కు వెళ్లారు. హోటల్లో చెక్ ఇన్ అయ్యి తమకు కేటాయించినా గదులకు వెళ్లేందుకు మూడో అంతస్తుకు వెళ్లారు. అయితే ఎక్కడ నుంచి వచ్చిందో ఏమో ఓ కుక్క వీరిని తరమడం మొదలుపెట్టింది. ఇక దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ మూడో అంతస్తు లో ఉన్న కిటికీ నుంచి కిందికి దూకేశాడు.
హైదరాబాద్ రామచంద్రాపురంలోని అశోక్‌నగర్‌లో తెనాలి యువకుడు ఉదయ్ (23) నివాసం ఉంటున్నాడు. ఆదివారం రోజున తన స్నేహితులతో కలిసి అతడు చందానగర్‌లోని వీవీప్రైడ్ హోటల్‌కు వెళ్లాడు. హోటల్ మూడో అంతస్తు బాల్కనీలోకి వెళ్లగానే ఓ కుక్క ఆ యువకుల వెంటపడింది. దాని నుంచి తప్పించుకునే క్రమంలో వారంతా పరుగు పెట్టారు. ఈ క్రమంలో ఉదయ్ అనే అబ్బాయి కుక్క తరముతుందనే భయంతో మూడో అంతస్థు నుంచి కిందికి దూకేశాడు. దీంతో తీవ్ర గాయాలతో పోరాడుతూ చనిపోయాడు.
కుక్క వెంటాడటం, యువకులు పరిగెత్తడం, ఉదయ్ కిటికీలో నుంచి దూకిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వెంటనే ఈ ఘటన బయటకు రాకుండా హోటల్ సిబ్బంది విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. అయినా తనతో వచ్చిన ఫ్రెండ్స్ కారణంగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీని పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపిస్తున్నారు.