హాలివుడ్ యానిమేషన్ సినిమా " ఇన్ సైడ్ అవుట్" సినిమా గుర్తుందా...సేమ్ కాన్సప్ట్ తో తెలుగు సినిమా వస్తే ఎలా ఉంటుంది. ఆ ఆలోచన కూడా సూపర్ డూపర్ సక్సస్ కనిపిస్తుంది. ఈ మూవీలో ప్రతి క్యారక్టర్ కు ఓ రూపం ఉంటుంది. అంటే ..కోపం, సంతోషం, బాధ, విరక్తి, ఇలా ప్రతి భావానికి ఓ రూపం...సేమ్ కాన్సప్ట్ తో వస్తున్న సినిమా " అరి" నిజానికి ఇది టాలీవుడ్ డైరక్టర్ జయశంకర్ చేసే పెద్ద ప్రయోగమే. సినిమా స్టార్ట్ అయ్యి ఏడాది పైనే అవుతుంది. మళ్లీ ఇన్నాళ్లకు అప్ డేట్ ఇచ్చారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: హాలివుడ్ యానిమేషన్ సినిమా " ఇన్ సైడ్ అవుట్" సినిమా గుర్తుందా...సేమ్ కాన్సప్ట్ తో తెలుగు సినిమా వస్తే ఎలా ఉంటుంది. ఆ ఆలోచన కూడా సూపర్ డూపర్ సక్సస్ కనిపిస్తుంది. ఈ మూవీలో ప్రతి క్యారక్టర్ కు ఓ రూపం ఉంటుంది. అంటే ..కోపం, సంతోషం, బాధ, విరక్తి, ఇలా ప్రతి భావానికి ఓ రూపం...సేమ్ కాన్సప్ట్ తో వస్తున్న సినిమా " అరి" నిజానికి ఇది టాలీవుడ్ డైరక్టర్ జయశంకర్ చేసే పెద్ద ప్రయోగమే. సినిమా స్టార్ట్ అయ్యి ఏడాది పైనే అవుతుంది. మళ్లీ ఇన్నాళ్లకు అప్ డేట్ ఇచ్చారు.
పేపర్ బాయ్ ఫేం వి. జయశంకర్ ఈ మూవీకి దర్శకుడు. ఇప్పుడు అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాల ఎవర్ ఏ క్యారెక్టర్ పోషిస్తున్నారో ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. ఇందులో అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్,హర్ష, చమ్మక్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, సురభి పద్మావతి, కేశవ్ దీపక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా, ఇందులో అనసూయ జెలస్, సాయికుమార్ అహంకారం (ప్రైడ్), హర్ష జెముడు లస్ట్ (కామం), శుభలేక సుధాకర్ (గ్రీడీ), శ్రీకాంత్(కోపం) అంటూ క్యారెక్టర్స్ రివీల్ చేసింది చిత్ర యూనిట్. ఇచట అన్ని కోరికలు తీర్చబడును అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ మూవీ కూడా మైథాలజీ థీమ్...కృష్ణుడే మెయిన్ థీమ్.
ఓ లైబ్రరీ చుట్టూ కథ నడుస్తున్నట్లు కనిపిస్తుంది. అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాలను ఆధారంగా చేసుకుని అరి అనే మూవీ తెరకెక్కుతుంది. అరిషడ్వర్గాలు మనిషిని ఎంతటి స్థాయికైనా దిగజారుస్తాయి. మనిషి పతనానికి ఈ కోరికలే కారణం. ఈ మూవీలో అనసూయ చాలా స్పెషల్ గా కనిపించింది. లస్ట్ క్యారక్టర్ లో హర్ష కూడా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. టాలీవుడ్ లో మరోసారి కృష్ణతత్వాన్ని చూడబోతున్నాం. ఎలా రీసివ్ చేసుకుంటారో చూడాలి.