తన మౌనాన్ని అలుసుగా తీసుకోవద్దని సాయిపల్లవి వార్నింగ్ ఇచ్చారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: తన పై వస్తున్న రూమర్స్ పై సినీ నటి సాయిపల్లవి చాలా గట్టిగా స్పందించారు. నిరాధారమైన పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు. తన మౌనాన్ని అలుసుగా తీసుకోవద్దని సాయిపల్లవి వార్నింగ్ ఇచ్చారు.
"చాలా సార్లు, దాదాపు ప్రతిసారీ నేను నిరాధారమైన పుకార్లు/ కల్పిత అబద్ధాలు/ తప్పుడు ప్రకటనలు వ్యాప్తి చెందడాన్ని చూసినప్పుడల్లా మౌనంగా ఉండటాన్ని ప్రయత్నిస్తుంటాను. వాటికి స్పందించడం అనవసరం అనేది నా భావన . కానీ ఇది ఆగడం లేదు. స్థిరంగా అలాగే కొనసాగుతున్నందున నేను ప్రతి స్పందించాల్సిన సమయం ఆసన్నమైంది.
ఇకపై నా సినిమాల విడుదలలు, ప్రకటనలు, నా కెరీర్‌లో సంతోషించదగిన క్షణాల సమయంలో గాసిప్‌ల పేరుతో చెత్త కథనాన్ని ప్రచురించడం చేస్తే.. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఇక పై నాకు సంబంధించిన ఏ మ్యాటర్ అయినా ఆధారాలు లేకుండా రాస్తే ఇక పై ఊరుకోను అని తెలిపింది. బాలీవుడ్ మూవీ 'రామాయణ'లో సీత పాత్ర చేసేందుకు సాయిపల్లవి తన అలవాట్లు, పద్ధతులు మార్చుకున్నారంటూ ఓ తమిళ వెబ్‌సైట్ కథనాలు ప్రచురించింది.