tirumala: అయ్యప్ప భక్తులకు చేదు అనుభవం  !


Published Dec 12, 2024 02:14:00 PM
postImages/2024-12-12/1733993217_productjpeg500x500.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: తిరుమల భక్తులకు ఓ చేదు అనుభవం ఎదురైంది . ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌ నిర్వాకం  అయ్యప్ప భక్తులను ఇబ్బంది కలిగించింది. ఏం జరిగిందంటే తిరుపతి వెళ్లిన అయ్యప్ప భక్తులు తిరుగు ప్రయాణంలో శ్రీవారి దర్శనానికి తిరుమల వచ్చారు. దర్శనం ఆలస్యం కావడంతో 35 మంది అయ్యప్ప భక్తులతో పాటు బ్యాగులను కూడా అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు.  దీంతో అయ్యప్ప భక్తులు పోలీసులకు ఫోన్ చేశారు. డయల్ 100కు అయ్యప్ప భక్తులు ఫోన్ చేయడంతో పోలీసులు స్పందించి నెల్లూరు టోల్‌గేట్‌ వద్ద బస్సును ఆపించారు. మరోవైపు అలిపిరి పోలీస్‌స్టేషన్‌లోను  ఆ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యాజమాన్యంపై అయ్యప్ప భక్తులు ఫిర్యాదు చేశారు.


ఈ రోజు చక్రతీర్థ ముక్కోటి సందర్బంగా తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ జరిగే అత్యంత ప్రముఖమైన ఉత్సవాల్లో చక్రతీర్థ ముక్కోటి ఒకటి. పవిత్ర తిరుమల గిరుల్లో ఎన్నో పుణ్య తీర్థాలు ఉన్నాయి. కుమారధార, ఆకాశగంగ, పాపవినాశనం, చక్ర తీర్థం వంటి తీర్ధాలు తిరుమల పవిత్రతను మరింత పెంచుతున్నాయి. ఈ తీర్థాలకు ఏటా ముక్కోటి ఉత్సవం జరుగుతుంది. దీంతో ఈ ఉత్సవాల్లో శ్రీవారి దర్శనం లేటవుతుందని బావించిన ప్రైవేట్ బస్సు డ్రైవర్ అయ్యప్ప భక్తులను అక్కడే వదిలిపోవడం పెద్ద గొడవకు తెర దింపింది.

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu bus-miss tirumala

Related Articles