Adah Sharma:శివతాండవ స్తోత్రాన్ని అద్భుతంగా ఆలపించిన ఆదాశర్మ.!

ఆదాశర్మ తెలుగు సినిమా ఇండస్ట్రీలో  మంచి గుర్తింపు తెచ్చుకొని దూసుకుపోతున్న హీరోయిన్. ముంబైకి చెందినటువంటి ఆదాశర్మ  ఎప్పుడు ఏదో ఒక విధంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.  చాలా వెరైటీ ఫోటోషూట్లు, వీడియోలు చేస్తూ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి అందరి ఆదరణలు పొందుతోంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ  ముంబైలోని  నేవి కుటుంబంలో జన్మించింది. చిన్నప్పటినుంచి నటనపై ఆసక్తి ఉండటం వల్ల  సినిమా రంగంలోకి అడుగు పెట్టింది.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-20/1721452401_sharma.jpg

 న్యూస్ లైన్ డెస్క్:ఆదాశర్మ తెలుగు సినిమా ఇండస్ట్రీలో  మంచి గుర్తింపు తెచ్చుకొని దూసుకుపోతున్న హీరోయిన్. ముంబైకి చెందినటువంటి ఆదాశర్మ  ఎప్పుడు ఏదో ఒక విధంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.  చాలా వెరైటీ ఫోటోషూట్లు, వీడియోలు చేస్తూ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి అందరి ఆదరణలు పొందుతోంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ  ముంబైలోని  నేవి కుటుంబంలో జన్మించింది. చిన్నప్పటినుంచి నటనపై ఆసక్తి ఉండటం వల్ల  సినిమా రంగంలోకి అడుగు పెట్టింది.

2008లోనే 1920 అనే హార్రర్ సినిమాలో నటించింది. అలా హిందీలో రెండు చిత్రాల్లో నటించిన తర్వాత హార్ట్ ఎటాక్ అనే చిత్రం ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో నితిన్ సరసన  కథానాయకగా చేసింది. ఈ చిత్రం కాస్త  బోల్తా పడడంతో ఆమెకు  అవకాశాలు రాలేదు. అయినా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సన్నాఫ్ సత్యమూర్తి, గరం, క్షణం వంటి చిత్రాల్లో నటించింది.

https://x.com/yskanth/status/1813904791489085807

ఈ విధంగా దూసుకుపోతున్నటువంటి ఆదాశర్మ  తాజాగా  భక్తి రసభావంలో మునిగిపోయి అందరినీ ఆకట్టుకుంటుంది. ఇంతకీ ఆమె ఏం చేసిందయ్యా అంటే శివతాండవ స్తోత్రాన్ని అద్భుతంగా ఆలపించింది. శివతాండవ స్తోత్రాన్ని గుక్క తిప్పుకోకుండా పూర్తి చేసింది. సాధారణంగా పూర్తి తెలుగు ఉచ్చరణ  వచ్చినవారే దీన్ని చదవాలంటే  నాలుక తిరగదు.  కానీ ఆదాశర్మ మాత్రం చాలా చక్కగా శివతాండవ స్తోత్రాన్ని ఆలపించింది.   ఆమె ఈ పాటను అద్భుతంగా ఆలపించడంతో సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. అద్భుత భక్తి రసభావం ఆదాశర్మ లో ఉందని , అద్భుతంగా ఆలపించిందంటూ కామెంట్లు పెడుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu adar-sharma shivathandava-strotram huart-attack

Related Articles