బిగ్ బాస్ తర్వాత కోట్లకు అధిపతిగా గంగవ్వ..ఎంతుందంటే.?

యూట్యూబర్ గంగవ్వ  అంటే  సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి  తెలిసే ఉంటుంది.మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించింది. అలాంటి గంగవ్వ వృద్ధాప్య


Published Sep 12, 2024 10:04:00 PM
postImages/2024-09-12/1726157514_gangavva1.jpg

న్యూస్ లైన్ డెస్క్: యూట్యూబర్ గంగవ్వ  అంటే  సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి  తెలిసే ఉంటుంది.మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించింది. అలాంటి గంగవ్వ వృద్ధాప్య వయసులో  పడి లేచిన కెరటంలా తన జీవితాన్ని సెట్ చేయడమే కాకుండా తన కుటుంబాన్ని ఒక లెవెల్ కు తీసుకెళ్లింది. ఇక గంగవ్వ పని అయిపోయింది అనుకున్న సమయంలోనే  తన సత్తా ఏంటో చూపించింది.

 అలాంటి గంగవ్వ జీవితం ఎంతోమంది సోమరులుగా తిరిగే యువతీ, యువకులకు  ఒక గుణపాఠంగా చెప్పుకోవచ్చు. అలాంటి గంగవ్వ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో పేరు తెచ్చుకొని చివరికి బిగ్ బాస్ షో లో అవకాశం దక్కించుకుంది.

మరి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత గంగవ్వ లైఫ్ ఎట్లా మారింది ఆమె ఏం సంపాదించింది అనే వివరాలు చూద్దాం..  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఒక మారుమూల గ్రామానికి చెందిన గంగవ్వ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించింది.  ఆమె ఎప్పుడైతే బిగ్ బాస్ రియాలిటీ షోకి వెళ్లిందో అప్పుడు ఆమె పేరు మరింత పాపులారిటీ అయింది. బిగ్ బాస్ హౌస్ లో ఉండగానే నాగార్జున ఆమెకి ఇల్లు కట్టిస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. దాని ప్రకారమే గంగవ్వకు తన సొంత ఇంటి కలను నిజం చేశారు నాగార్జున.

 అంతకుముందు  పాత పెంకుటిల్లులో ఉండే గంగవ్వ ఇప్పుడు పెద్ద బంగ్లా తన ఆస్తులకు సంబంధించిన ఒక వీడియోను  తన యూట్యూబ్ ఛానల్ ద్వారా బయటపెట్టింది. గంగవ్వ మొత్తం 22 లక్షలతో ఇల్లు నిర్మించుకుంది.  అంతేకాకుండా మరో మూడు లక్షలతో ఆవుల షెడ్డు, అలాగే తొమ్మిది లక్షలతో నాలుగున్నర గంటల పొలం, మరో దగ్గర రెండున్నర ఎకరాల పొలం ఉంది. దీని విలువ 80 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది.

అంతే కాకుండా ఇంకో దగ్గర 3 లక్షల ఫ్లాట్, మరో దగ్గర ఎనిమిది లక్షల విలువైన 15 గుంటల పొలం కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. గంగవ్వ ఇంట్రెస్ట్ ఇచ్చిన డబ్బులు అన్నీ కలుపుకుంటే రెండు కోట్లకు పైగా అనే ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వయసులో కూడా గంగవ్వ  ఎదిగి చూపించింది అంటే,  అన్ని ఉండి మూలన పడుకొని  కలలు కనే వారికి  గంగవ్వ ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పవచ్చు. ఇలాంటి గంగవ్వని చూసైనా సోమరిపోతులు మారాలని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nagarjuna big-boss praperties gangavva my-village-show rich

Related Articles