ఎంత సాదాసీదా వ్యక్తి అంటే వేల కోట్లున్నా...జేబులో పైసా పెట్టుకోని వ్యక్తి. తన కారు అద్దంలోంచి ..విలాసాలు కాదు...సామాన్య ప్రజల కష్టాలు కనిపించేవి అతనికి . కష్టపడుతుంటే కన్నీళ్లు కాదు
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బతకడం వేరు ...జీవించడం వేరు. బతకడం ఎలా అయినా బతికేస్తాం. కాని జీవించడం అంటే కొన్ని విలువలతో చనిపోయాక కూడా మనల్ని గుర్తుంచుకునేలా జీవించడం. అలా జీవితాన్ని విలువలతో నడిపించిన వ్యక్తి రతన్ టాటా. ఎంత సాదాసీదా వ్యక్తి అంటే వేల కోట్లున్నా...జేబులో పైసా పెట్టుకోని వ్యక్తి. తన కారు అద్దంలోంచి ..విలాసాలు కాదు...సామాన్య ప్రజల కష్టాలు కనిపించేవి అతనికి . కష్టపడుతుంటే కన్నీళ్లు కాదు ..చేయూతనివ్వాలనే ఆలోచన వచ్చే వ్యక్తి. అయితే రతన్ టాటా ..మరో వెయ్యి ఏళ్లు ప్రజల గుండెల్లో బతుకుతారు.
రతన్ టాటా గురించి అమితాబచ్చన్ ఓ సంధర్బంలో తలుచుకున్నారు. రతన్ టాటా ఆయన ఓ సారి లండన్ కు ఒకే విమానంలో ప్రయాణించారట. హీత్రో ఎయిర్ పోర్టులో దిగిన తర్వాత రతన్ కోసం తన స్టాఫ్ ఎవ్వరు రాలేదు. అయితే ఫోన్ చేసి వస్తా అని వెళ్లిన రతన్ ..వెంటనే వచ్చేశారు. ఏమైందని అడగగా...రతన్ టాటా..అమిత్ నాకు మీరు కొంత అప్పు ఇవ్వగలరా...ఫోన్ చెయ్యడానికి డబ్బుల్లేవన్నారట. నేను నమ్మలేదు. తన ఆస్తి విలువ వేల కోట్లు కాని ఫోన్ చెయ్యడానికి డబ్బుల్లేవు. ఎంత సింపుల్ గా ఉన్నారు.
‘‘ఒక ఈవెంట్‌కు రతన్ టాటాతో పాటు ఆయన స్నేహితుడు ఒకరు హాజరయ్యారు. తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో నన్ను మా ఇంటి దగ్గర దింపగలవా అని స్నేహితుడిని అడిగారు. నా దగ్గర కారు లేదు. ఏం అనుకోకండి మా ఇళ్లు మీ ఇంటి వెనకే మా ఇళ్లు అని రతన్ టాటా చెప్పారట. దీంతో ఆ స్నేహితుడు చాలా ఆశ్చర్యానికి గురయ్యాడు. అంత సంపన్నుడి నుంచి ఇలాంటివి ఊహించగలమా..!? ఎంత ఆశ్చర్యం!!’’