Anasuya:అనసూయకి గుడి.. ఎక్కడో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలోని హాట్ యాంకర్లలో అనసూయ భరద్వాజ్ కూడా ఒకరు.అంతేకాకుండా పలు చిత్రాల్లో కూడా నటిస్తూ  తన కెరియర్ లో దూసుకుపోతోంది. అలాంటి అనసూయ భరద్వాజ్ కు పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నా కానీ ఇప్పటికీ కన్నెపిల్లలా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించినటువంటి హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రకారు గుండెలను పిసికేస్తుంది. అలాంటి ఈ బ్యూటీ  జబర్దస్త్ అనే షో ద్వారా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైనటువంటి క్రేజ్ సంపాదించుకుంది.


Published Jul 06, 2024 03:20:03 AM
postImages/2024-07-06/1720250286_nasuya.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలోని హాట్ యాంకర్లలో అనసూయ భరద్వాజ్ కూడా ఒకరు.అంతేకాకుండా పలు చిత్రాల్లో కూడా నటిస్తూ  తన కెరియర్ లో దూసుకుపోతోంది. అలాంటి అనసూయ భరద్వాజ్ కు పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నా కానీ ఇప్పటికీ కన్నెపిల్లలా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించినటువంటి హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రకారు గుండెలను పిసికేస్తుంది. అలాంటి ఈ బ్యూటీ  జబర్దస్త్ అనే షో ద్వారా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైనటువంటి క్రేజ్ సంపాదించుకుంది.

ఆ తర్వాత ఆమెకు వరుస షోలలో యాంకరింగ్ చేసే ఆఫర్లు రావడంతో తన హవాను మరింత హైలెట్ చేసుకోగలిగింది. అలాంటి అనసూయ ఈ మధ్యకాలంలో టెలివిజన్ రంగంలో ఎక్కువగా కనిపించడం లేదు. స్టార్ యాంకర్ గా కొన్ని సంవత్సరాల పాటు తన ప్రభావాన్ని చూపినటువంటి అనసూయ భరద్వాజ్  ఈమధ్య సినిమాల్లో చేస్తూ చాలా బిజీ అయిపోయింది. కేవలం తెలుగులోనే కాకుండా దక్షిణాదిలోని చాలా భాషల్లో ఈమెకు వరుసగా ఆఫర్లు క్యూ కడుతున్నాయట.

https://www.facebook.com/share/p/XvT1hngvULo1h7yJ/?mibextid=qi2Omg

గత సంవత్సరం మైకేల్ అనే మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ అమ్మడు  పెదకాపు 1, రంగమార్తాండ,విమానం, ప్రేమ విమానం వంటి చిత్రాలలో అదిరిపోయే పాత్రలు చేసింది.  ఇక ఈ సినిమాలే కాకుండా పాన్ ఇండియా లెవెల్ సినిమాలైనటువంటి హరహర వీరమల్లు, పుష్ప2, ఈ సుందరాంగి  వంటి భారీ ప్రాజెక్టుల్లో కూడా నటిస్తున్నది. ఈ విధంగా తన కెరియర్ లో మంచి ఫామ్ లో ఉన్నటువంటి అనసూయ భరద్వాజ్  ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు అభిమానుల నుంచి వచ్చిన కామెంట్లకు రిప్లై కూడా ఇస్తుంది.

అలాంటి ఈ ముద్దుగుమ్మ  తాజాగా రెడ్ కలర్ సారీలో తన హాట్ అందాలను ఆరబోసింది.  దీంతో అభిమానులు అనసూయ అందానికి ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. ఇక ఒక అభిమాని అయితే అనసూయకు గుడి కట్టించాలని అనుకుంటున్నాను, కానీ డబ్బులు లేక బ్యాంకు కన్నం వేద్దామనుకుంటే పోలీస్ మామూలు వచ్చి పట్టుకెళ్లారంటూ కామెంట్స్ పెట్టారు. ప్రస్తుతం ఈ కామెంట్ హైలైట్ గా నిలవడంతో  సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇవే కాకుండా పలువురు అభిమానులు రకరకాల కామెంట్లతో అనసూయను ఓ మోస్తారుగా  ట్రోల్ చేస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu anchor anasuya-bharatwaj temple

Related Articles