anasuya : గ్లామర్ డోస్ పెంచుతా..డబ్బులు ఎక్కువ తీసుకుంటానంటున్న బ్యూటీ

సోషల్ మీడియా లో అనసూయ స్పీడ్ చూస్తే ...హీరోయిన్లకే భయమేస్తుంటుంది. అంత ఫాస్ట్ గా ఉంటుంది ఆంటీ. గ్లామర్ , కాంట్రవర్సీలు , సినిమాలు , టాలెంట్ వాట్ నాట్ ...అంటిలోను అమ్మడు స్పీడ్. అయితే రోజుకో కాంట్రవర్సీ లేకపోతే ...అనసూయ బతకలేదు.


Published Jul 25, 2024 06:32:00 AM
postImages/2024-07-25/1721869418_266763anasuya.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సోషల్ మీడియా లో అనసూయ స్పీడ్ చూస్తే ...హీరోయిన్లకే భయమేస్తుంటుంది. అంత ఫాస్ట్ గా ఉంటుంది ఆంటీ. గ్లామర్ , కాంట్రవర్సీలు , సినిమాలు , టాలెంట్ వాట్ నాట్ ...అంటిలోను అమ్మడు స్పీడ్. అయితే రోజుకో కాంట్రవర్సీ లేకపోతే ...అనసూయ బతకలేదు. బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తుంటుంది. 
రీసెంట్ గా అనసూయ సింబా అనే చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఈ చిత్ర ట్రయిలర్ లాంచ్ ఈవెంట్ లో అనసూయ పాల్గొంది. మీడియా అడిగిన అన్ని ప్రశ్నలకు అనసూయ సమాధానం ఇచ్చింది. ఎందుకు చాలా పాత్రలకు నో చెప్తున్నారు అని అడిగారు...మీరు చాలా ఆఫర్స్ రిజెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు అని ప్రశ్నించారు మీడియా మిత్రులు..


అనసూయ సమాధానం ఇస్తూ.. రీపీటెడ్ గా ఒకే తరహా పాత్రలు ఇస్తున్నారు. ఒక సినిమాలో చేసేసిన క్యారక్టర్ మళ్లీ మళ్లీ నేను చెయ్యను. కావాలనుకుంటే గ్లామర్ డోస్ పెంచుతా...డబ్బులు ఎక్కువ డిమాండ్ చేస్తా ...రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్ర తర్వాత అదే విధంగా చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ నేను ఒప్పుకోలేదు. క్షణం తర్వాత పోలీస్ పాత్రలు కూడా వస్తున్నాయి. కానీ నేను చేయను. 


నేను సైన్ చేసిన చిత్రాలు పూర్తి చేసేశాను. ఇప్పుడు నా చేతిలో ఉన్నవి రెండు మాత్రమే అని అనసూయ తెలిపింది. నేను ఎక్కువగా సినిమాలకు ఒప్పుకోకపోవడానికి కారణం కూడా ఉంది. నా గ్లామర్ ని ఎక్కువగా ప్రదర్శించాలని అనుకుంటున్నా. అందులో తప్పు లేదు. నేను గ్లామర్ మైంటైన్ చేసినన్ని రోజులు అలాంటి పాత్రలు వస్తే చేస్తా. నా అందం ఉన్నంత వరకు గ్లామర్ పాత్రలే చేస్తా... అని చెప్పేసింది. రెమ్యునరేషన్ విషయంలో కూడా ఏమాత్రం తగ్గను అని అనసూయ పేర్కొంది. నా క్యారెక్టర్ కి తగ్గట్లుగా దిమ్మతిరిగే పారితోషికం అడుగుతా అని అనసూయ తెలిపింది. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu anasuya-bharatwaj social-media

Related Articles