ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ప్రేమ వ్యవహారాలు లైంగిక వేధింపుల గురించి కొంతమంది లేడీ నటీనటులు బయటకు వచ్చి పోలీస్ స్టేషన్ లో ఆశ్రయిస్తున్నారు. తాజాగా జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా
న్యూస్ లైన్ డెస్క్: ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ప్రేమ వ్యవహారాలు లైంగిక వేధింపుల గురించి కొంతమంది లేడీ నటీనటులు బయటకు వచ్చి పోలీస్ స్టేషన్ లో ఆశ్రయిస్తున్నారు. తాజాగా జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేసే అమ్మాయి, తనను జానీ మాస్టర్ లైంగికంగా వేదికల గురి చేస్తున్నాడని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అది కాస్త హైలెట్ గా నిలిచింది. దీంతో జానీ మాస్టర్ ను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపడుతున్నారు.
ఈ తరహాలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలలో మరో జానీ మాస్టర్ లాంటి వ్యక్తి ఉన్నాడు. అయితే ఆయన డ్యాన్స్ మాస్టర్ కాదు, పాటల మాస్టారు. తన కింద పని చేసే ఒక లేడీస్ సింగర్ ను వాడుకొని విపరీతంగా వేధింపులకు గురి చేస్తున్నాడట. పెళ్లి చేసుకోమని అడిగితే చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడట. తాజాగా జగిత్యాల జిల్లాలో జరిగినటువంటి ఈ సంఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే ఫోక్ సాంగ్స్, రైటర్ సుద్దాల మల్లిక్ తేజ అంటే తెలియని వారు ఉండరు. తెలంగాణలో చాలా రకాల ఫోక్ సాంగ్స్ ను మల్లిక్ తేజ రాసి పాడి ఫేమస్ అయ్యారు.
అయితే ఈయనతో కో సింగర్ గా మామిడి మౌనిక అంటే కూడా తెలియని వారు ఉండరు. ఇద్దరి కాంబినేషన్ లో ఎన్నో సాంగ్స్ వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. అయితే మళ్లీక్ తేజ మామిడి మౌనికను చాలా కాలం నుంచి లైంగికంగా వేధిస్తూ వస్తున్నారట. అంతే కాదు చాలాసార్లు స్టూడియోలోనే ఆమెపై లైంగిక దాడి కూడా చేశాడట. చివరికి పెళ్లి విషయం వచ్చేసరికి కాస్త మొహం విరుస్తుండడంతో మామిడి మౌనిక జగిత్యాలలోని పోలీసులకు ఫిర్యాదు చేసిందట.
దీనిపై కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. అంతేకాదు మామిడి మౌనికకు యూట్యూబ్ ఛానల్ యొక్క ఐడిలను కూడా మార్పు చేసి విపరీతంగా బ్లాక్ మెయిల్ చేస్తూ నన్ను వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నదట. మరి దీనిపై పోలీసులు విచారణ చేసి ఎలాంటి విషయాలు బయట పెడతారో ముందు ముందు తెలుస్తుంది.