diwali : టపాసుల పండగకు రానున్న చిత్రాలివే!

ఈ సినిమాలన్నీ కలెక్షన్స్​తో పాటు కూడా కంటెంట్ పరంగా మిక్స్​డ్​ రివ్యూస్​ రావడంతో నిరాశ తప్పలేదు. దసరా బాక్సాఫీసు పెద్దగాలేదు. 


Published Oct 16, 2024 08:03:00 PM
postImages/2024-10-16/1729089428_232494thumb665.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  దీపావళి పండుగకు ఫుల్ ప్రిపేరవుతున్నారు ఇండస్ట్రీ వాళ్లు. దివాళీ సంధర్భంగా కొన్ని సినిమా రిలీజ్ అవుతున్నాయి. ఏ పండుగైనా తెలుగురాష్ట్రాల్లో సినిమా రిలీజ్ అవ్వాల్సిందే. కాసుల వర్షం లేని పండుగ ఉండనే ఉండదు ఇండస్ట్రీకి .వేట్టాయన్, విశ్వం, మా నాన్న సూపర్ హీరో, జనక అయితే గనక లాంటి. ఈ సినిమాలన్నీ కలెక్షన్స్​తో పాటు కూడా కంటెంట్ పరంగా మిక్స్​డ్​ రివ్యూస్​ రావడంతో నిరాశ తప్పలేదు. దసరా బాక్సాఫీసు పెద్దగాలేదు. 
ఇక దసరా పండుగ తూతూ మంత్రంగా దాటిపోవడంతో, సినీ పరిశ్రమ కళ్లన్నీ రాబోయే దీపావళి మీదే ఉన్నాయి. పెద్దగా సెలవులు లేకపోవడంతో పాటు ..ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే సినిమాలతో నిర్మాతలు రెడీగా ఉన్నారు. విశ్వక్ సేన్ సినిమా మెకానిక్ సినిమా దసరా రేసు నుంచి తప్పుకుంది. మరి ఎప్పుడు రిలీజ్ అనేది క్లారిటీ లేదు.


* వీటితో దుల్కర్ సల్మాన్ మూవీ 'లక్కీ భాస్కర్'పై మంచి అంచనాలు ఉన్నాయి. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తుంది. దుల్కర్ సల్మాన్ కు మహానటితో టాలీవుడ్ లోను మంచి ఫేమ్ ఉంది. ఇది దీపావళి రిలీజ్.


*సాయి పల్లవి హీరోయిన్‌గా తమిళ అనువాదం సినిమా 'అమరన్' కూడా దీపావళి బరిలో నిలవనుంది. రాజ్ కుమార్ పెరియసామి దర్వకత్వంలో వస్తుంది.


*  బఘీరా కూడా దీపావళికే రానుంది.  ఇది కన్నడ యాక్టర్ శ్రీమురళి హీరోగా వస్తుంది. ఈ సినిమా ప్రశాంత్ నీల్ కథ అందించారు.. కేజీఎఫ్, కాంతార, సలార్ లాంటి సినిమాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ దీనిని నిర్మించింది.


* 'కార్తీకేయ' ఫేం నిఖిల్ హీరోగా సడెన్‌గా పోటీలోకి వచ్చింది 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో'. 'స్వామి రా రా', 'కేశవ' సినిమాల్లో కలిసి పనిచేసిన నిఖిల్ - డైరక్టర్ సుధీర్ వర్మ తో సినిమా చేశారు. ఇది కూడా దివాళీ రిలీజ్ తో రానుంది.


*1970ల నాటి కథతో ముస్తాబైన ఈ సినిమాను 'క'అనే టైటిల్‌తో తెలుగుతో పాటు తమిళంలోనూ రిలీజ్ కానుంది. అటు దేవుడు కాన్సప్ట్ తో రావడంతో దీపావళికి వర్కవుట్ అవుతుందని నమ్ముతారు. ఈ సినిమాకు ఇద్దరు డైరక్టర్లు సుజిత్ , సందీప్ ఈ సినిమాను డైరక్ట్ చేస్తున్నారు. ఈ దివాళీ ఇండస్ట్రీ ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చూడాలి. 


2025 సంక్రాంతికి గేమ్ ఛేంజర్ బెర్త్ ఖరారు చేసుకోగా​, NBK 109, వెంకటేష్​ - అనిల్ కాంబినేషన్​లో రాబోయే మూడో సినిమా, మజాకా, గుడ్ బ్యాడ్ అగ్లీలు వస్తాయని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. వీటితో పాటు నాగ చైతన్య హీరోగా వస్తున్న తండేల్ కూడా సంక్రాంతికే వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

newsline-whatsapp-channel
Tags : tollywood movies nikhil dulkar-salman kiran-abbavaram diwali

Related Articles