Marriage:30ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటున్నారా..ఇవి తప్పక తెలుసుకోండి.!

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. ఈ ఘట్టాన్ని మనం ఏ విధంగా మలుచుకుంటే వివాహబంధమనేది ఆ విధంగా ఉంటుంది.  అలాంటి వివాహ జీవితాన్ని మొదలుపెట్టడానికి  ప్రస్తుతం చాలామంది యువత మొహం విరుస్తున్నారు. ఒకప్పుడు 20 ఏళ్లలోపే చాలా మంది పెళ్లిళ్లు చేసుకొని నిండు నూరేళ్లు హ్యాపీగా ఆరోగ్యంగా జీవించేవారు.


Published Jul 23, 2024 08:10:00 PM
postImages/2024-07-23/1721744277_marriage.jpg

న్యూస్ లైన్ డెస్క్: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. ఈ ఘట్టాన్ని మనం ఏ విధంగా మలుచుకుంటే వివాహబంధమనేది ఆ విధంగా ఉంటుంది.  అలాంటి వివాహ జీవితాన్ని మొదలుపెట్టడానికి  ప్రస్తుతం చాలామంది యువత మొహం విరుస్తున్నారు. ఒకప్పుడు 20 ఏళ్లలోపే చాలా మంది పెళ్లిళ్లు చేసుకొని నిండు నూరేళ్లు హ్యాపీగా ఆరోగ్యంగా జీవించేవారు.

ఇప్పుడు 50 ఏళ్లు వచ్చినా పెళ్లిళ్లు చేసుకోవడంలో చాలా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఉండేవారు మాత్రం 50 ఏళ్లు దాటిన పెళ్లిళ్లపై అస్సలు సుముఖత చూపించడం లేదు.  అలాంటి పెళ్లిళ్లు ఏ వయసులో చేసుకుంటే మంచిది అనే వివరాలు చూద్దాం.  ముఖ్యంగా 30 ఏళ్ల నుంచి 33 ఏళ్లలోపు పెళ్లి చేసుకుంటే చాలా మంచిదట. అనేక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు అంటున్నారు. 

 స్పష్టత:
30 తర్వాత పెళ్లి చేసుకునే వారిలో అన్ని విషయాల్లో స్పష్టత ఉంటుంది. మీరు ఈ వయసు వరకు ఎన్నో చూస్తూ ఉంటారు స్నేహితుల మధ్య గడుపుతారు. దీనివల్ల వచ్చే జీవిత భాగస్వామి విషయంలో కూడా అని అర్థం చేసుకోగలుగుతారు.
 
 పిల్లల్ని కనడం:
 30 ఏళ్ల తర్వాత పిల్లల్ని కనే విషయంలో కూడా  అనేక మార్పులు వస్తాయి. మెంటల్ గా ఫిజికల్ గా వచ్చే విషయాలలో కూడా వీరు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. కానీ ఒక గర్భం దాల్చే విషయంలో మాత్రమే కాస్త ఇబ్బందులు అవుతాయి. 

 కమ్యూనికేషన్: 
 జీవితంలో ఏదైనా అర్థం చేసుకునే వయసు అనేది 30 ఏళ్ల వరకు వచ్చేస్తుంది. కష్టాలు వచ్చినా వాటిని అధిగమించే శక్తిని పొందుతారు. లైఫ్ పార్టనర్ విషయంలో ఏదైనా గొడవ వస్తే కూడా దాన్ని చర్చించుకుని క్లియర్ చేసుకుంటారు.

newsline-whatsapp-channel
Tags : news-line good-life marriage girls 30-years good-qualities

Related Articles