చాలామంది తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలనే ఆలోచనతో ఇతర దేశాలకు వెళ్లి పనిచేస్తూ ఉంటారు. ఈ సమయంలో వారు మానసిక ఇబ్బందులతో పాటు శారీరక ఇబ్బందులు కూడా అనేకం
న్యూస్ లైన్ డెస్క్: చాలామంది తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలనే ఆలోచనతో ఇతర దేశాలకు వెళ్లి పనిచేస్తూ ఉంటారు. ఈ సమయంలో వారు మానసిక ఇబ్బందులతో పాటు శారీరక ఇబ్బందులు కూడా అనేకం పడాల్సి వస్తుంది. అయితే కొంతమంది అక్కడికి వెళ్లిన తర్వాత ఎక్కువ సమయం పని చేయడం వల్ల వారు మానసికంగా కృంగిపోయి కుటుంబంతో కనీసం మాట్లాడే సమయం కూడా దొరకదు. దీంతో అసహనం పెరిగిపోయి తొందరగా అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు. అంతేకాకుండా కొన్ని దేశాలు, వెళ్లే ముందు ఒక విధంగా చెప్పి వెళ్లిన తర్వాత మరో విధంగా ఎక్కువ గంటలు పని చేయించుకుంటారు. ప్రపంచ దేశాలలో ఎక్కువ గంటలు పని చేయించుకునే దేశాలేంటి ఆ వివరాలు ఏంటో చూద్దాం..
మలేషియా:
వ్యవసాయం, ప్యాకింగ్ కు సంబంధించిన ఎక్కువ బిజినెస్ లు ఇక్కడి నుంచే నడుస్తాయి. అయితే మన దేశం నుంచి అక్కడికి ఎంతోమంది వ్యక్తులు పని కోసం వెళ్తూ ఉంటారు. అయితే వీళ్ళు వారానికి 52 గంటలకు పైగా పని చేయాల్సి ఉంటుంది. వారంలో కనీసం ఐదు రోజుల పాటు ఆఫీసులోనే 10 గంటలకు పైగా పని చేయాలట.
యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ :
చాలామంది దుబాయ్ వెళ్తే ఎంచక్కా పని చేసుకుంటూ బాగా సంపాదించవచ్చని అనుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఫైనాన్స్, నిర్మాణారంగాలు, చమురు సంస్థలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ ప్రాంతంలో కూడా వారానికి 52 గంటలు పని చేయించుకుంటారట. అలా ఇతర దేశాల్లో సమయానికి మించి పనిచేయడం వల్ల తొందరగా అనారోగ్యం భారిన పడతారట.
హాంగ్ కాంగ్:
ప్రపంచ దేశాల్లో ప్రముఖ వాణిజ్య, ఆర్థిక కేంద్రంగా మారింది హాంకాంగ్. అయితే ఈ నగరంలో నిత్యం ప్రజలు ఒత్తిడిలో ఉండేలా చేస్తుందట. అయితే ఈ దేశంలో కనీసం వారంలో 51 గంటలకు పైగా పని చేయాల్సి ఉంటుందట.
సింగపూర్:
ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో సింగపూర్ కూడా ఒకటి. ఈ దేశంలో కూడా వారానికి రెండు రోజులు వీకెండ్ తీసేస్తే మిగతా ఐదు రోజుల్లో 10 గంటల పాటు ఆఫీసులోనే పనిచేయాల్సి ఉంటుందట. ఇదే కాకుండా తైవాన్ వంటి దేశాల్లో కూడా 10 గంటలపాటు పనిచేయవలసి ఉంటుందట.