Asia Cup: పాకిస్తాన్ పై లంక గ్రాండ్ విక్టరీ

ఆసియా కప్ టోర్నీలో భాగంగా శుక్రవారం రంగి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరిగిన శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మహిళ జట్ల సెమీ ఫైన‌ల్‌‌ పోరులో లంక ఘన విజయం సాధించింది.


Published Jul 26, 2024 11:58:43 AM
postImages/2024-07-26/1722012964_final2.PNG

ఆసియా కప్ ఫైనల్‌కు శ్రీలంక
పాకిస్తాన్ పై లంక గ్రాండ్ విక్టరీ
చమరి ఆటపట్టు తుఫాన్ ఫిఫ్టి
అనుష్క సూపర్ క్యామియో

న్యూస్ లైన్ స్పోర్ట్స్:  ఆసియా కప్ టోర్నీలో భాగంగా శుక్రవారం రంగి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరిగిన శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మహిళ జట్ల సెమీ ఫైన‌ల్‌‌ పోరులో లంక ఘన విజయం సాధించింది. శ్రీలకం బ్యాటర్లు చమరి ఆటపట్టు తుఫాన్ ఫిఫ్టితో పాక్ బౌలర్లకు చుక్కలు చూపించగా.. విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగింది. దాంతో లంక జట్టు, పాకిస్తాన్ పై 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విక్టరీతో శ్రీలంక ఫైనల్‌కు చేరింది. ఆదివారం భారత్, లంక జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడనున్నారు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ మహిళ జట్టుకు ఓపెనర్లు మంచి ప్రారంభాన్ని అందించారు. గుల్ ఫిరోజా, మునీబా అలీ ఇద్దరూ ధనాధన బ్యాటింగ్‌ చేస్తూ స్టేడియంలో పరుగుల వరద పారించారు. ఈ జోడి కలిసి స్కోర్ బోర్డుకు 60 రన్స్ జతచేశారు. అయితే ఫిరోజా(25), ఉదేశిక ప్రబోధని బౌలింగ్‌లో భారీ ష్టార్ట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరింది. ఆ తర్వాత మునీబా అలీ(37), సిద్రా అమీన్(10) వరుసగా ఔటయ్యారు. దాంతో పాకిస్తాన్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 80 పరుగులు కొట్టింది. ఇక ఈ సమయంలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ నిదా దార్ ధనాధన బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించింది. అయితే కవిషా దిల్హరి బౌలింగ్‌లో దార్(23) వెనుదిరిగింది. దాంతో పాక్ మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది. అఖరిలో అలియా రియాజ్, ఫాతిమా సనా మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. బౌండరీలు బాదుతూ లంక బౌలర్లపై చెలరేగారు.  రియాజ్(16 నటౌట్), సనా( 23 నటౌట్) వీళ్లిందరూ కలిసి 40 పరుగుల భాగస్వామ్యాని నెలకొల్పారు. దాంతో పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 140 రన్స్ కొట్టింది. లంక బౌలర్లు కవిషా దిల్హరి, ఉదేశిక ప్రబోధని ఇద్దరు రెండు వికెట్లు పడగొట్టారు.

భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ విష్మి గుణరత్నే (0), సాదియా ఇక్బాల్ బౌలింగ్‌లో డకౌట్‌గా పెవిలియన్‌కు చేరింది. ఆ తర్వాత క్రీజులో దిగిన హర్షిత సమరవిక్రమ మంచి ఇన్నింగ్స్ ఆడింది. కెప్టెన్ చమరి ఆటపట్టు హార్డ్ హిటింగ్ బ్యాటింగ్ చేసింది. బౌండరీలు, సిక్సర్లు కొడుతూ పాక్ బౌలర్లకు ఊచకోత చూపించింది. అయితే హర్షిత(12), ఒమైమా సోహైల్ ఓవర్‌లో ఎల్బీగా వెనుదిగింది. ఆ కాసేపటీకే కవిషా దిల్హరి(17) కూడా ఔటయ్యింది. దాంతో శ్రీలంక జట్టు మూడూ వికెట్లు కోల్పోయి 70 రన్స్ కొట్టింది. ఇక తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన నీలాక్షి డి సిల్వా(0) నిరశా పరిచింది. ఆటపట్టు వేగంగా బ్యాటింగ్ చేస్తూ (46 బంతుల్లో 59 పరుగులు 8 ఫోర్లు, 1 సిక్సర్)తో హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. మరో ఎండ్‌తో అనుష్క సంజీవని తుఫాన్ బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ చమరితో కలిసి 40 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. కానీ ఆటపట్టు(63)ను సాదియా ఇక్బాల్ క్లీన్ బౌల్డ్ చేసింది. అయితే అఖరిలో అనుష్క(24 నటౌట్) లంక జట్టును అదుకుంది. దాంతో శ్రీలంక జట్టు ఉత్కంఠ పోరులో విజయం సాధించింది. లంక, పాకిస్తాన్ జట్టుపై 3 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ విజయంతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ నెల 28 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాతో తలపడనుంది.

newsline-whatsapp-channel
Tags : india-people won-the-match asia-cup srilanka pakistan

Related Articles