KTR: ఇందిరమ్మ పాలనలో మహిళా జర్నలిస్టులకే రక్షణ లేదా?

రుణమాఫీ వివరాలపై రైతులతో మాట్లాడేందుకు వెళ్లిన మహిళా జర్నలిస్టులు విజయారెడ్డి, సరితలు గురువారం ఉదయం కొడంగల్ నియోజకవర్గంలోని రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లికి వెళ్లారు. రైతులతో మాట్లాడుతున్న తమ వద్దకు వెళ్లి రేవంత్ అనుచరులు దాడికి పాల్పడినట్లు సరిత తెలిపారు.


Published Aug 22, 2024 11:52:22 AM
postImages/2024-08-22/1724307742_ktrreactsonjournalistsissue.jpg

న్యూస్ లైన్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామంలో ఆయన అనుచరులు ఇద్దరు మహిళా జర్నలిస్టులపై దాడి చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రుణమాఫీ వివరాలపై రైతులతో మాట్లాడేందుకు వెళ్లిన మహిళా జర్నలిస్టులు విజయారెడ్డి, సరితలు గురువారం ఉదయం కొడంగల్ నియోజకవర్గంలోని రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లికి వెళ్లారు. 

అయితే, రైతులతో మాట్లాడుతున్న తమ వద్దకు వెళ్లి రేవంత్ అనుచరులు దాడికి పాల్పడినట్లు సరిత తెలిపారు. తాజగా, ఈ అంశంపై మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మహిళా జర్నలిస్టులపై దాడిని ఆయన ఖండించారు. 

రైతు రుణమాఫీపై అసలు వాస్తవాలను ప్రజలకు చూపించేందుకు సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లికి వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరితా, విజయారెడ్డిపై  సీఎం అనుచరులు దాడి చేయడం దారుణమని ఆయన ట్వీట్ చేశారు. ఇందిరమ్మ పాలనగా ఫోజులు కొట్టే ఈ కాంగ్రెస్ పాలనలో మహిళా జర్నలిస్టులకే రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. రుణమాఫీ సరిగా జరిగి ఉంటే.. సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారని ఆయన నిలదీశారు. 

విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య అని వెల్లడించారు. వెంటనే కాంగ్రెస్ గుండాలపైన కేసులు నమోదు చేసి వారిని అరెస్టు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిపై వెంటనే మహిళా కమిషన్ కూడా స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు. 

newsline-whatsapp-channel
Tags : india-people ts-news news-line newslinetelugu brs telanganam journalist ktrbrs saritha-avula kondareddipalli journalist-saritha-avula journalist-vijaya-reddy attack-on-lady-journalists

Related Articles