రేపు అమ్మ బాలత్రిపుర సుందరిగా దర్శనం ఇస్తుంది. "ఓంకార పంజరశుకీ ముపనిషదుద్యానకేళి కళకంఠీమ్" అని బాలాత్రిపుర సుందరీదేవిని ప్రార్ధిస్తే అజ్ఞానం పటాపంచలైపోతుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: విజయవాడ ఇంద్రకీలాద్రి లో శరనవరాత్రులు చాలా ఘనంగా జరుగుతాయి. అక్కడ అమ్మవారు ఏ రూపంలో ఉంటారో అదే ..అవతార రూపాన్ని జనాలు కొలుస్తారు. రేపు అమ్మ బాలత్రిపుర సుందరిగా దర్శనం ఇస్తుంది. "ఓంకార పంజరశుకీ ముపనిషదుద్యానకేళి కళకంఠీమ్" అని బాలాత్రిపుర సుందరీదేవిని ప్రార్ధిస్తే అజ్ఞానం పటాపంచలైపోతుంది.
సమస్త దేవీ మంత్రములలోకెల్లా ఈ బాలా మంత్రం మహిమాన్వితమైనది. అందుకే శ్రీ విద్యోపాసకులు మొదటగా బాలా మంత్రాన్నే ఉపదేశిస్తారు. జగన్మాతను కొలిస్తే అమాయకత్వం పోతుంతదని నమ్ముతారు. అంతేకాదు శ్రీ చక్రంలో కొలువై ఉన్న మొట్టమొదటి దేవత బాలత్రిపుర సుందరి .
కుమారీ పూజ
ఈ రోజు అమ్మవారి పేరిట భక్తులు కుమారి పూజ చేస్తారు. 8 సంవత్సరాల లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజించడం ఆనవాయితీ. ఇది ఇంటికి కూడా మంచిది. ఇలా చిన్నారులకు తాంబూలం ఇచ్చి వారిని సంతోషపెడితే కష్టాలు ఉండవని ప్రతీతి.ఈరోజు అమ్మవారికి గులాబీ రంగు వస్త్రంతో అలంకరించాలి. గులాబీ పూలతో అమ్మను పూజించాలి. అలాగే కుమారి పూజలో పాల్గొనే బాలికలకు కూడా గులాబీ రంగు వస్త్రాన్ని అందించాలి. శ్రీ మాత్రే నమః ఈ మంత్రం చదివితే చాలా మంచిది.