బెంగుళూరులో న్యూ హారిజాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ప్రొఫెసర్ రవి చేసిన ఈ డ్యాన్స్ ను ఓ విద్యార్ధి వీడియో తీసి ఇన్స్ స్టాగ్రామ్ లో అప్ లోడ్ చేశారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : లెక్చరర్ అనగానే ..సీరియస్ లుక్ ...ఫార్మల్ డ్రెస్ ...ఓ స్కూటీ ఇవే బొమ్మ పడుతుంది. కాని ఫన్ మోడ్ లెక్చరర్స్ కూడా బోలెడు మంది ఉంటారు. కొంతమంద చక్కగా మాట్లాడతారు. మరికొంతమంది భలే ఫన్నీగా ఉంటారు. అయితే బెంగుళూరులో న్యూ హారిజాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ప్రొఫెసర్ రవి చేసిన ఈ డ్యాన్స్ ను ఓ విద్యార్ధి వీడియో తీసి ఇన్స్ స్టాగ్రామ్ లో అప్ లోడ్ చేశారు.
ఈ వీడియోలో మాస్టారు సూపర్ గా మైఖెల్ జాక్సన్ పాటకు స్టెప్పులు వేస్తున్నారు. ఈ వీడియో వైరల్ గా మారింది. దాదాపు 2 లక్షల మంది ఈ వీడియోకు లైక్ కొట్టగా.. 27 లక్షల మందికి పైగా చూశారు. రవి సార్ జోష్ ఏమాత్రం తగ్గలేదంటూ ఆయన పూర్వ విద్యార్థులు ఈ వీడియోకు కామెంట్లు పెడుతున్నారు. ఇంత మంచి డాన్సర్ ...ఎలా లెక్చరర్ అయ్యారంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆయన శిష్యులు కావడం మా అదృష్టం అంటూ కామెంట్లలో చెబుతున్నారు. రవి సార్ క్లాస్ కు ఆ రోజు ఒక్క విద్యార్థి కూడా మిస్ అయి ఉండడని కామెంట్ చేశాడు.