పిల్లలకు దసరా సెలవులు వచ్చాయి. దీంతో చాలా మంది పేరెంట్స్ లాంగ్ టూర్లు ప్లాన్ చేస్తుంటారు. లాంగ్ టూర్ ప్లాన్ చేస్తే లైఫ్ లో ఒక్కసారైనా ఈ ప్లేసులు చూడాల్సిందే
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పిల్లలకు దసరా సెలవులు వచ్చాయి. దీంతో చాలా మంది పేరెంట్స్ లాంగ్ టూర్లు ప్లాన్ చేస్తుంటారు. లాంగ్ టూర్ ప్లాన్ చేస్తే లైఫ్ లో ఒక్కసారైనా ఈ ప్లేసులు చూడాల్సిందే. మీరు మీ పిల్లలకి కాస్త బడ్జెట్ ఎక్కువైన పర్లేదు చూపించాలనుకుంటే ఈ ప్లేసులు చూడండి.
మౌంట్ అబూ: రాజస్థాన్ అందాలతో పిల్లలు ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు.అర్బుద దేవి ఆలయం, నక్కి లేక్, టోడ్ రాక్, అచల్‌గఢ్ కోట.. రాజస్థాన్ కల్చర్ వాళ్లకి చాలా నచ్చుతుంది. ఒంటెలు సంగీతం, ఫుడ్ ఇలా ఒక్కటి కాదు అన్ని రకాలుగాను ఎంజాయ్ చేస్తారు .
కేరళ : ట్రీ హౌజ్, వత్తిరి, చెంబ్రా శిఖరం, కురువా ద్వీపం, తిరునెల్లి ఆలయం వంటి ప్రసిద్ధ ప్రదేశాలను వయనాడ్‌లో చూడవచ్చు. మీ పిల్లలకు ఈ ప్లేస్ భలే నచ్చుతుంది ట్రస్ట్ మీ ..సూపర్ ప్లేస్.
మున్నార్: అక్టోబర్ అంటే అసలు మంచి గ్రీనరీ టైం . చాలా బాగుంటుంది. చుట్టు ఆ పచ్చదనంతో పిల్లలు భలే హ్యాపీ గా ఉంటారు. ఇక్కడ హౌస్‌బోట్‌తో సహా అద్భుతమైన కొండలు, కనువిందు చేసే జలపాతాలు ప్రత్యేకతలు పిల్లలకు చాలా ప్రశాంతంగా ఉంటుంది.
గోవా..మీ పిల్లలు కాని టీనేజర్స్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు తీసుకెళ్లండి. గోవా అంటే మందు , మగువలే కాదు బ్యూటిఫుల్ సన్ సెట్స్ ...చుట్టుప్రక్కల మంచి మంచి వాటర్ ఫాల్స్ ఉన్నాయి చూసుకొండి.
మీరు వెళ్లే ప్లేస్ హిల్ స్టేషన్ అయితే చూసుకొండి. కొండ చరియలు విరిగిపడడం లాంటివి కాని కంటిన్యూస్ వర్షాలు కాని ఉంటే లైట్ తీసుకొండి . అడ్వాన్స్‌గా హోటల్ బుక్ చేసుకోండి. అన్ని పర్యాటక ప్రాంతాలకు బస్సులు, రైళ్లు, విమాన సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. మాగ్జిమం పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వాడితే ..మీకు ఖర్చు తగ్గుతుంది. సో ట్రై చెయ్యండి. హ్యాపీ దసరా .