బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమై ఒకరోజు గడిచిపోయింది. ఇప్పటికే హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. ఈసారి బిగ్ బాస్ షో చాలా వెరైటీగా ఉంటుందని నాగార్జున ప్రకటిస్తూ వచ్చారు.
న్యూస్ లైన్ డెస్క్: బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమై ఒకరోజు గడిచిపోయింది. ఇప్పటికే హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. ఈసారి బిగ్ బాస్ షో చాలా వెరైటీగా ఉంటుందని నాగార్జున ప్రకటిస్తూ వచ్చారు. ఎన్నో ట్విస్టులు ఎన్నో గేమ్స్ అనేక రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయని చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా లిమిట్స్ లేని ఎంటర్టైన్మెంట్ ఉండబోతుందని ఆయన అంటూనే ఉన్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజు నుంచే ట్విస్టులు ఇవ్వడం ప్రారంభించారు బిగ్ బాస్.
అలాంటి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ లో చాలామంది సినీ ఇండస్ట్రీకి చెందిన వారే ఉన్నారు. ఇందులో ముఖ్యంగా వారు హౌస్ లోకి వచ్చే ముందే వారి వారికి సంబంధించిన టీమ్స్ ను ఏర్పాటు చేసుకొని ఓటింగ్స్ వేయించుకుంటారు. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి కంటెస్టెంట్ ప్రేరణ కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన నటి. ఆమెకు స్టార్ హీరోయిన్ అయినటువంటి రష్మిక మందన్నతో మంచి సంబంధం ఉందట. వీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అట. ఈ విషయాన్ని ప్రేరణ చాలా ఇంటర్వ్యూల్లో చెప్పింది. అయితే ప్రేరణ సినిమా సీరియల్స్ లో ఎంతో ఫేమస్ అయింది. ఈ మధ్యకాలంలోనే ఆమెకి పెళ్లి కూడా జరిగిందట.
అయితే ప్రేరణ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో ఒక చిన్న విషయాన్ని మాట్లాడింది. నేను రష్మిక మందన్న క్లోజ్ ఫ్రెండ్స్ అని, ఇద్దరం కలిసి ఎన్నో అల్లరి పనులు కూడా చేసే వాళ్ళమని రష్మిక ప్రస్తుతం పెద్ద పొజిషన్ కి వెళ్లడం నాకు ఎంతో హ్యాపీ అనిపించిందని అన్నది. అంతే కాదు ఇద్దరం కలిసి ఒకే స్కూటీపై రాత్రుళ్లు తిరిగేవారిమని, అలా హోటల్స్ కి వెళ్లి ఫుడ్ తినే వాళ్ళమని చెప్పుకొచ్చింది. ఈ విధంగా రష్మికతో ఆమె ఫ్రెండ్షిప్ గురించి ఈ విధంగా చెప్పడంతో రష్మిక అభిమానులంతా ప్రేరణకే సపోర్ట్ చేసే విధంగా కనిపిస్తోంది. ఒకవేళ రష్మిక మందన్న ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తే మాత్రం ఆమె టాప్ 5లో నిలిచే అవకాశం కూడా ఉంటుంది.