Bigboss8:3వారాలకు అభయ్ అంత రెమ్యునరేషన్ అందుకున్నారా.?

బిగ్ బాస్ సీజన్ 8 ఎవరు ఊహించని ట్విస్టులతో , అద్భుతమైన గేమ్ కంటెంట్ తో దూసుకుపోతోంది. కానీ ఈసారి హౌస్ లోకి వచ్చిన వారంతా  చాలా వెరైటీగా బిహేవ్ చేస్తున్నారు. బాలీవుడ్ బిగ్ బాస్ ఎలా ఉంటుందో, తెలుగు బిగ్ బాస్ కూడా


Published Sep 23, 2024 08:19:16 AM
postImages/2024-09-23/1727059756_abhay.jpg

న్యూస్ లైన్ డెస్క్: బిగ్ బాస్ సీజన్ 8 ఎవరు ఊహించని ట్విస్టులతో , అద్భుతమైన గేమ్ కంటెంట్ తో దూసుకుపోతోంది. కానీ ఈసారి హౌస్ లోకి వచ్చిన వారంతా  చాలా వెరైటీగా బిహేవ్ చేస్తున్నారు. బాలీవుడ్ బిగ్ బాస్ ఎలా ఉంటుందో, తెలుగు బిగ్ బాస్ కూడా ఆ విధంగా తయారవుతుందని చెప్పవచ్చు. ఇలా బిగ్ బాస్ మొదలై ఇప్పటికే మూడు వారాలు గడిచిపోయింది. ముఖ్యంగా మొదటి వారం బేబక్క ఎలిమినేట్ అయింది. ఆ తర్వాత రెండవ వారం శేఖర్ భాషా హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇక మూడో వారం అభయ్  హౌస్ నుంచి బయటకు వచ్చేశారు.

అయితే ప్రస్తుతం అభయ్ బయటకు రావడానికి ప్రధాన కారణం ఆయన నోటి దులుసు అని చెప్పవచ్చు. ఎందుకంటే  బిగ్ బాస్ ను తిట్టడం, గేమ్స్ లో సరైన పాటిస్పేట్ చేయకపోవడం  ఇలా అన్ని మైనస్ లు తనకు తానే తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ పై విరుచుకు పడడం వల్ల నాగార్జున రెడ్ కార్డు అందించాడు.  అయితే నాగార్జున రెడ్ కార్డు అందించడం ద్వారా అభయ్ ఎలిమినేషన్ అవ్వలేదు. ఆయన బిహేవర్ వల్ల ఓట్ల శాతం తగ్గిపోవడంతో ఈ వారం బయటకు వెళ్లాల్సి వచ్చింది.

 ఏది ఏమైనా అభయ్ మూడు వారాల్లో  షాకింగ్ రెమ్యూనరేషన్ అందుకున్నారట. ఆయన ఒక్క రోజుకు దాదాపుగా 30 వేల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారట. అంటే వారానికి రెండు లక్షల పైగానే అమౌంట్ వస్తుంది. మొత్తం మూడు వారాలకు కలిపి ఆరు లక్షలకు పైగా పారితోషికం అందుకున్నారని తెలుస్తోంది. ఏదిఏమైనా అభయ్ మూడు వారాల్లో ఎంతో ఫేమస్ అయ్యారు అని చెప్పవచ్చు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nagarjuna nikhil big-boos8 remnuretion naga-manikanta aakula-sonia abhai

Related Articles