Bigboss8:నైనికా లైఫ్ లో ఇన్ని కష్టాలా.. తెలిస్తే కన్నీరే.?

బిగ్ బాస్ సీజన్ 8 మిగతా అన్ని సీజన్ల కంటే ఈ సీజన్ చాలా వెరైటీగా ఉంటుంది.  అన్ లిమిటెడ్ ఫన్, అన్ లిమిటెడ్ రెమ్యూనరేషన్  అంటూ సాగుతున్న ఈ బిగ్ బాస్ లో  అన్ని రివర్స్ గానే ఉన్నాయి.


Published Sep 16, 2024 04:29:56 PM
postImages/2024-09-16/1726484396_nainika123.jpg

న్యూస్ లైన్ డెస్క్: బిగ్ బాస్ సీజన్ 8 మిగతా అన్ని సీజన్ల కంటే ఈ సీజన్ చాలా వెరైటీగా ఉంటుంది.  అన్ లిమిటెడ్ ఫన్, అన్ లిమిటెడ్ రెమ్యూనరేషన్  అంటూ సాగుతున్న ఈ బిగ్ బాస్ లో  అన్ని రివర్స్ గానే ఉన్నాయి.  ఇంతకు ముందుల మనం ఊహించింది ఇందులో కనిపించదు. అలాంటి బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత  మొదటి వారం చీప్ లుగా నైనిక, యస్మి గౌడ, నిఖిల్ ఉన్నారు. ఇందులో నైనిక చీప్ గా అద్భుతమైన పర్ఫామెన్స్  తో దూసుకుపోతోంది.  అలాంటి నైనిక బిగ్బాస్ హౌస్ లోకి వచ్చే ముందు ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను పంచుకుంది.

అయితే నైనిక పుట్టింది ఒడిస్సా. తన చిన్నతనంలోనే ఆడపిల్ల అని తన నాన్న వదిలేసి వెళ్ళిపోయాడట. ఇక అప్పటినుంచి  ఎన్నో కష్టాలు పడి చివరికి హైదరాబాద్ వచ్చిన నైనిక  డాన్స్ నేర్చుకొని ఢీ షో ద్వారా  అద్భుతమైన గుర్తింపు తెచ్చుకుంది. ఆ విధంగా సోషల్ మీడియాలో కూడా లక్షలాదిమంది ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. ఆమె ఢీ షోలో మగవారితో కూడా పోటీపడి మరి డాన్స్ చేసేది. ఈ విధంగా నైనికాకు బిగ్ బాస్ లో ఆఫర్ వచ్చింది.  అంతేకాదు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి కూడా ప్రయత్నాలు చేసిందట.

కానీ కొంతమంది దర్శక, నిర్మాతలు కమిట్మెంట్ అడిగారని అది తనకి ఇష్టం లేక రీల్స్, షార్ట్ ఫిలిమ్స్, డాన్సులు, వెబ్ సిరీస్ చేసుకుంటూ ఉన్నానని చెప్పింది. నయనం అనే వెబ్ సిరీస్ లో  చేసి మంచి ప్రేక్షక ఆదరణ పొందింది. ఈ విధంగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నైనిక  తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ హౌస్ లో కూడా హైలెట్ అవుతోంది.  వెళ్లిన మొదటి వారమే చీప్ గా స్థానాన్ని దక్కించుకుని రెండవ వారం  చీఫ్ పదవిని పోగొట్టుకుంది.  అలాంటి నైనిక ప్రస్తుతం  బిగ్బాస్ హౌస్లో తన ప్రత్యేకమైన ఆట మాట తీరుతో దూసుకుపోతోంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nagarjuna nikhil dhee-show bigboss8 vishnu-priya nainika yashmi-gouda

Related Articles