సీజన్స్ లో టాప్ 3 లో కూడా సూట్ కేసు తీసుకొని వెళ్లిపోయిన వాళ్లు ఉన్నారు. కాని ఈ సారి ఎవ్వరు సూట్ కేస్ తీసుకోలేదు. సో ఇదంతా నిఖిల్ కే .
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే అయిపోయింది. నిఖిల్ విన్నర్ గా టైటిల్ కొట్టాడు. గత 7 సీజన్స్ కి బిగ్ బాస్ తెలుగు ప్రైజ్ మనీ రూ. 50 లక్షలుగా ఉంది. అలాగే ఒక కారు, ప్లాట్ వంటి బహుమతులు కూడా విన్నర్ కి అందిస్తారు. కాని ఈ సారి మాత్రం 54,99999 ఈ సీజన్ కి గాను ప్రైజ్ మనీగా ఫిక్స్ చేశారు. దీన్ని రౌండ్ ఫిగర్ చేద్దామన్న నాగార్జున రూ. 55,00000లుగా నిర్ణయించారు. ఇదంతా నిఖిల్ కే దక్కింది. అయితే ముందు సీజన్స్ లో టాప్ 3 లో కూడా సూట్ కేసు తీసుకొని వెళ్లిపోయిన వాళ్లు ఉన్నారు. కాని ఈ సారి ఎవ్వరు సూట్ కేస్ తీసుకోలేదు. సో ఇదంతా నిఖిల్ కే .
గత ఏడు సీజన్స్ లో ఇదే హయ్యెస్ట్ ప్రైజ్ మనీ. అలాగే నిఖిల్ కి దాదాపు రూ. 7 లక్షల విలువ చేసే మారుతి సుజుకీ కారు బహుమతిగా అందించారు. ఇక రెమ్యూనరేషన్ గా మరో రూ 33.75 లక్షలు సంపాదించాడు. బిగ్ బాస్ లో వచ్చిన క్యాష్ ప్రైజ్ లో టాక్స్ పే చేస్తారు. ఇవన్నీ పోగా ...నిఖిల్ కు ఎంత వస్తుందో చూద్దాం.
రూ. 55 లక్షలు పూర్తిగా నిఖిల్ కి దక్కవు. ఆదాయపన్ను చట్టాల ప్రకారం ప్రైజ్ మనీని సాధారణ ఆదాయంగా పరిగణించరు. పెద్ద మొత్తంలో టాక్స్ కట్ చేస్తారు. 30.9 శాతం టాక్స్ కటింగ్ ఉంటుంది. ఈ డబ్బులో ప్రైజ్ మనీ కాబట్టి దాదాపు 17 లక్షలు ట్యాక్స్ పే చెయ్యాల్సింది.కారు ధర లో కూడా ట్యాక్స్ పే చెయ్యాల్సిందే అన్నీ పోగా 25 నుంచి 30 లక్షలు మాత్రమే నిఖిల్ కి దక్కుతుంది.