గంగవ్వ లాగా..చిన్న యూట్యూబ్ నుంచి మొదలై..బిగ్ బాస్ వరకు వెళ్లడమే కాదు ఒక్కో అడుగు ముందుకు వెళ్తూ ...కోట్లు కూడబెట్టింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అదృష్టం వరించాలంటే..వయసు తో సంబంధం ఏముంది చెప్పండి. మనకి రాసి పెట్టి ఉంటే ఏ వయసులో అయినా స్టార్ అవుతాం. గంగవ్వ లాగా..చిన్న యూట్యూబ్ నుంచి మొదలై..బిగ్ బాస్ వరకు వెళ్లడమే కాదు ఒక్కో అడుగు ముందుకు వెళ్తూ ...కోట్లు కూడబెట్టింది.రీసెంట్ గా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆస్తుల వివరాలు తెలిపింది. మై విలేజ్ షో టీమ్ గంగవ్వ ఆస్తుల, సంపాదన గురించి తన పర్సనల్ విషయాలు అన్ని చెప్పుకొచ్చింది.
బిగ్ బాస్ షోలో తరువాత తన లైఫ్ చాలా మారిందని ..తాను ఉంటున్న ఇల్లును చూపించింది. ఆ షో తరువాతే ఈ ఇంటిని నిర్మించానని, దానికి రూ.22 లక్షలు ఖర్చు పెట్టినట్టు తెలిపింది. తన ఆవుల కోసం దాదాపు 3 లక్షలు పెట్టాననని ...మరో ఏరియాలో 9 లక్షలు పెట్టి నాలుగు కుంటల భూమి కొన్నానని చెప్పింది. రెండున్నర ఎకరాల పొలం ఉందని ..దాని విలువ ఇప్పుడు 75 నుంచి 80 లక్షలు వస్తుందని చెప్పింది.
అంతేకాదు ... ఇంకోచోట కమర్షియల్ ప్లాట్ కూడా కొనుగోలు చేసినట్లు పేర్కొంది. వీటన్నిటితో పాటు మరికొన్నిచోట్ల వ్యవసాయ భూమిలు కూడా ఉన్నాయని తెలిపింది. ఇక తన పొలం, ఆవులు, ఇతర స్థలాలు, ఇల్లు మొత్తంగా కలిపి తన ఆస్తుల విలువ రూ.కోటి 30 లక్షల వరకు ఉంటుందని గంగవ్వ ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ డబ్బులతోనే మనవరాలి పెళ్లి కూడా చేశా. కూతుర్లకు రెండు లక్షలు ఇచ్చాను. చిన్న చిన్న పనులు చాలా చేశా..దేవుని దయ వల్ల చాలా బాగున్నా..సంపాదించుకున్నా.