కౌంటర్ అటాక్స్ జరిగిన కథలను తీసుకొని సినిమాలు నిర్మించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ఇలాంటి రియల్ ఇన్సిడెంట్స్ తో అనేక సినిమాలు వచ్చాయి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ప్రస్తుతం భారతదేశం అంతా ఆపరేషన్ సిందూర్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్ చేసిన ఉగ్రదాడికి గట్టిగా సమాధానమిస్తూభారత్ ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. దీంతో సోషల్ మీడియాలో బయట ఆపరేషన్ సిందూర్ అనే పేరు బాగా వైరల్ అవుతుంది. మనకు తెలిసిందేగా...సినిమాలు నిర్మాతలు టైటిల్ కోసం తెగ ఎగబడుతున్నారు.
కౌంటర్ అటాక్స్ జరిగిన కథలను తీసుకొని సినిమాలు నిర్మించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ఇలాంటి రియల్ ఇన్సిడెంట్స్ తో అనేక సినిమాలు వచ్చాయి. అందుకే ఇప్పుడు కొన్ని నిర్మాణ సంస్థలు ఆపరేషన్ సిందూర్ అనే టైటిల్ కోసం పోటీపడుతున్నారు. ఆపరేషన్ సిందూర్ అనే సినిమా టైటిల్ కోసం దాదాపు 15 సినిమా నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ లో ఇప్పటికే పలువురు నిర్మాతలు ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారట. బాలీవుడ్ అగ్రనిర్మాణ సంస్థలు టీ సిరీస్ , జీ స్టూడియోస్ కూడా ఉన్నాయట. మరి ఆపరేషన్ సిందూర్ టైటిల్ ఎవరికి దక్కుతుందో ...ఈ రియల్ ఫైట్ ను ఏ సంస్థ దక్కించుకున్నారో తెలియాలి.