పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాల్లోని విమానాశ్రయాలను మూసివేశారు. స్కై లైన్ లో యుద్ధవిమానాలు గస్తీ కాస్తున్నాయి. ఇక్కడ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలను యాక్టివేట్ చేశారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : " ఆపరేషన్ సిందూర్ " తర్వాత భారత్ అప్రమత్తమైంది. పాకిస్తాన్ తో సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో హైఅలర్ట్ కొనసాగుతుంది. ఏ తరహా పరిస్థితి ఎదురైన ధీటుగా బదులిచ్చేందుకు భద్రతా చర్యలు యుద్ద ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఈ క్రమంలో రాజస్థాన్ లో 1,037 కిలోమీటర్ల మేరకు ఉన్న పాక్ సరిహద్దును సీల్ చేశారు. సరిహద్దుల్లో ఎవరైనా అనుమానంగా ప్రవర్తిస్తే కాల్చి వేసేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక భారత్ వాయుసేన కూడా పూర్తిగా అప్రమత్తమైంది. పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాల్లోని విమానాశ్రయాలను మూసివేశారు. స్కై లైన్ లో యుద్ధవిమానాలు గస్తీ కాస్తున్నాయి. ఇక్కడ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలను యాక్టివేట్ చేశారు.
పంజాబ్‌లోని ఆరు సరిహద్దు జిల్లాలు ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, ఫాజిల్కా, అమృత్‌సర్, గురుదాస్‌పూర్స తర్న్ తరన్ - లోని అన్ని పాఠశాలలను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పాకిస్థాన్‌తో పంజాబ్ 532 కి.మీ సరిహద్దును పంచుకుంటుంది. అందువల్ల, ఏదైనా సైనిక ఉద్రిక్తత సమయంలో పంజాబ్ ప్రభుత్వ పాత్ర చాలా కీలకంగా మారుతుంది. పాకిస్థాన్ కూడా జమ్ము , కాశ్మీర్ లో కాకుండా పంజాబ్ లాంటి ప్రాంతంలో అటాక్స్ చెయాలనుకోవడం పాక్ ప్లాన్. జమ్మూలో ఎక్కువ శాతం ముస్లిం ప్రజలే. అదే పంజాబ్ లో అయితే ముస్లిమేతరులు ..ఇక్కడ భారత్ ప్రభుత్వం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది .
అవసరమైతే పంజాబ్ పోలీసులు కూడా రెండవ శ్రేణి రక్షణ వ్యవస్థగా పాకిస్థాన్‌కు దీటుగా స్పందించడానికి సైన్యంతో చేరతారని మంత్రి అమన్ అరోరా తెలిపారు. ఏది ఏమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో పంజాబ్ పాత్ర చాలా కీలకమైనది. అందుకే ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశారు . భద్రతా చర్యల్లో భాగంగా మే 10 వరకు ఉత్తర, వాయవ్య రాష్ట్రాల్లోని 21కి పైగా విమానాశ్రయాలు మూసివేయాలని కేంద్రం ఆదేశించింది. రాజస్థాన్‌లోని జోధ్‌పుర్, బికనేర్, కిషన్‌ఘర్ విమానాశ్రయాలను మూసివేశారు. ఇక చర్యల్లో భాగంగా అమృత్ సర్ విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. బహిరంగప్రదేశాల్లో జనాలు గుమిగూడి ఉండకూడదని సూచించారు. భద్రతా చర్యల్లో భాగంగా పోలీసు అధికారులకు అన్ని రకాల సెలవులను రద్దు చేశారు.