మే 6,7 అర్ధరాత్రి ఆపరేషన్ సిందూర్ తర్వాత సరిహద్దులో పాకిస్థాన్ కాల్పులు తీవ్రతీరం చేసింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : పహల్గాం దాడులకు ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ రెండో రోజు కొనసాగుతుంది. మే 6,7 అర్ధరాత్రి ఆపరేషన్ సిందూర్ తర్వాత సరిహద్దులో పాకిస్థాన్ కాల్పులు తీవ్రతీరం చేసింది. దీనికి బదులుగా భారత్ పాకిస్థాన్ రక్షణ వ్యవస్థలపై దాడులు జరిపింది. దీంతో లాహోర్ లోని గగనతల రక్షణ వ్యవస్థ నిర్వీర్యం అయినట్లు భారత సైన్యం గురువారం ప్రకటించింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం తీవ్రం అయ్యింది.
పంజాబ్‌లోని గురుదాస్‌పుర్ జిల్లాలో బ్లాకౌట్
గురువారం రాత్రి 9 గంటల నుంచి బ్లాకౌట్
పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో పాఠశాలలు అన్నీ బంద్ చేశారు. ఆదివారం వరకు విద్యాసంస్థలన్ని మూసేశారు.