Budget 2024: బడ్జెట్‍కు ముందు హల్వా వేడుక ఎందుకు చేస్తారబ్బా..!

వినడానికే విచిత్రంగా ఉంది కదా...బడ్జెట్ ప్రవేశ పెట్టే ముందు హల్వా వేడుక నిర్వహిస్తారు.


Published Jul 26, 2024 01:22:56 PM
postImages/2024-07-26/1722018161_budget9.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: వినడానికే విచిత్రంగా ఉంది కదా...బడ్జెట్ ప్రవేశ పెట్టే ముందు హల్వా వేడుక నిర్వహిస్తారు. ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లోని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి  ఎవరైతే వారు ఈ వేడుకను జరుపుతారు. ఈ సారి నిర్మలా సీతారామన్ హల్వా వేడుకను చేశారు.


హాల్వా వేడుకతో బడ్జెట్ తయారీ "లాక్-ఇన్" ప్రక్రియ ప్రారంభం అవుతుంది. రాబోయే బడ్జెట్ ను గోప్యతగా ఉంచడానికి, చివరకు పార్లమెంటులో సమర్పించే ముందు ఎటువంటి లీక్‌లను లేకుండా ఉండడానికి లాక్-ఇన్ ప్రక్రియ ఉంటుంది. బడ్జెట్ తయారు చేయడానికి డైరక్ట్ గా సంబంధం ఉన్న వాళ్లంతా డెజర్ట్ వెళ్తుంది. ఇలా వెళ్లింది అంటే ఇక ఎక్కడ ఎవ్వరు ..బడ్జెట్ గురించి మాట్లాడకూడదు...డైరక్ట్ గా పెద్దల సమక్షంలోనే ఈ చిట్టాపద్దులు విప్పాలి. అంతవరకు ఆర్ధిక మంత్రిత్వ శాఖ లోనే ఉండాలి.


ఏదైనా శుభవార్త అందితే స్వీట్లు పంచుతాం. ముఖ్యమైన లేదా ప్రత్యేకమైనదాన్ని ప్రారంభించే ముందు ఏదైనా తీపిని తినడం భారతీయ సంప్రదాయం. అందుకే బడ్జెట్‌కు హల్వా వేడుక నిర్వహిస్తారు. అంతా మంచే జరగలని...బడ్జెట్ లిస్ట్ చేసేశాం అని సంతోషంతో కొంతమంది హాల్వా తింటారు. ఇది కంపల్సరీ చేస్తారు. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu karachi-halwa nirmala-seetharan

Related Articles